![](https://test1.latestly.com/wp-content/uploads/2022/09/Jignesh-Mevani-380x214.jpg)
Ahmadabad, SEP 16: గుజరాత్‌లో కాంగ్రెస్ పార్టీకి (Congress party) షాక్ తగిలింది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లలో ఒకరిగా ఉన్న ఎమ్మెల్యే, దళిత నేత జిగ్నేష్ మెవానికి (Jignesh Mevani) అహ్మదాబాద్ కోర్టు (Ahmedabad court) ఆరు నెలల జైలు శిక్ష విధించింది. 2016 అల్లర్లకు సంబంధించి మెవానితోపాటు మరో 18 మందికి శిక్ష ఖరారు చేస్తూ శుక్రవారం కోర్టు తీర్పు వెలువరించింది. 2016 అక్టోబర్‌లో గుజరాత్ యూనివర్సిటీకి సంబంధించిన ఒక బిల్డింగ్‌కు అంబేద్కర్ పేరు పెట్టాలని కోరుతూ మెవాని (Ahmedabad court) నిరసన చేపట్టాడు. అప్పట్లో ఈ నిరసన ఉద్రిక్తతకు దారి తీసింది. అనుమతి లేకుండా నిరసన చేపట్టడం, రోడ్డు బ్లాక్ చేయడం వంటి చర్యల ఆధారంగా మెవానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం 20 మందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ (FIR) దాఖలు చేశారు. 2016 నుంచి దీనిపై విచారణ కొనసాగుతోంది.
తాజాగా ఈ కేసులో 20 మందిని నిందితులుగా పేర్కొంటూ, జైలు శిక్ష విధించింది అహ్మదాబాద్ కోర్టు. కాగా, 20 మందిలో ఒకరు మరణించారు. దీంతో మెవానితోపాటు మరో 18 మందికి కోర్టు శిక్ష ఖరారు చేసింది.
Video: ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్
వచ్చే డిసెంబర్‌లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లలో ఒకరిగా ఉన్న జిగ్నేష్ మెవాని అరెస్టు కావడం ఆ పార్టీకి ఎదురుదెబ్బగానే చెప్పాలి. అయితే, ఈ తీర్పుపై మెవాని పై కోర్టులో అప్పీల్ చేసే అవకాశం ఉంది.