Ahmadabad, AUG 28: గుజరాత్‌ను భారీ వర్షాలు (Gujrat Rains) ముంచెత్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో వరద పోటెత్తుతోంది. పలు నగరాల్లో రోడ్లు (Heavy Rains) జలమయమయ్యాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో దాదాపు 15 మంది ప్రాణాలు కోల్పోయారు. అధికారులు 23,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సుమారు 300 మందిని సహాయక బృందాలు కాపాడాయి. మోర్బీలో ఒకరు, గాంధీనగర్‌లో ఇద్దరు, ఆనంద్‌లో ఆరుగురు, వడోదరలో ఒకరు, ఖేదాలో ఒకరు, మహిసాగర్‌లో ఇద్దరు, ఒకరు మరణించారు. భరూచ్‌లో మరణించగా, అహ్మదాబాద్‌లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 23,870 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించగా, 1,696 మందిని రక్షించారు. అయితే మంగళవారం వర్షం తీవ్రత తగ్గుముఖం పట్టినప్పటికీ.. రాబోయే రోజుల్లో మరింత భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణవాఖ గుజరాత్‌కు హచ్చరికలు జారీ చేసింది.
వీడియో ఇదుగోండి
This reminds me of 26 July,2005 - Mumbai Floods! Now its Gujarat!
Scenes from Vadodara⚠️#GujaratRains pic.twitter.com/ecXHZLEa9n
— Mumbai Nowcast (@s_r_khandelwal) August 27, 2024
రెస్క్యూ. రిలీఫ్ ఆపరేషన్లను వేగవంతం చేయడానికి , గుజరాత్ ప్రభుత్వం (Gujarat rescue) ఆరు ఇండియన్ ఆర్మీ బృందాల సాయం కోరింది దేవభూమి ద్వారక, ఆనంద్, వడోదర, ఖేడ, మోర్బి, రాజ్‌కోట్ జిల్లాల్లో సైన్యం, 14 ఎన్‌డీఆర్‌ఎఫ్, 22 ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నాయి. వర్షాల ధాటికి సురేందర్‌నగర్ జిల్లాలో ఓ బ్రిడ్జి కూలిపోయింది.
వీడియో ఇదుగోండి
The India Meteorological Department (IMD) has issued a 'red alert' for several districts in Gujarat, forecasting heavy to very heavy rainfall over the next five days.
#HeavyRainfall #GujaratRains #vadodararain pic.twitter.com/lgfZQ8rkYC
— Crypto Aman (@cryptoamanclub) August 28, 2024
अगर बहुत जरूरी ना हो तो इस समय गुजरात घूमने से बचे,बारिश ने कहर मचाया हुआ है। खासकर अहमदाबाद,वडोदरा में भयंकर बारिश है।
प्रभु धीर धरो..
बाढ़ के हालात हैं #GujaratFlood #HeavyRain #GujaratRains #vadodararain #HeavyRainAlert #Gujarat #Ahmedabad #AhmedabadRains pic.twitter.com/5ddCzz6SdU
— Monu kumar (@ganga_wasi) August 28, 2024
వర్షాల పరిస్థితి, సహాయక చర్యలను సమీక్షించేందకు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ (Bhupendra Patel) ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. భారీ వర్షాల కారణంగా పొంగిపొర్లుతున్న నదులు, డ్రెయిన్లు, సరస్సుల్లోకి ఎవరూ వెళ్లకుండా పోలీసుల సహకారం తీసుకుని పూర్తి అప్రమత్తతతో పాటు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అంతే కాకుండా వాతావరణ శాఖ ప్రత్యేకంగా మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదనే హెచ్చరికను కచ్చితంగా పాటించాలని తీర ప్రాంతాల జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
వీడియో ఇదుగోండి
જામનગરમાં પાણીના પ્રવાહ વચ્ચે થાંભલે ફસાયેલા યુવકનું રેસ્ક્યૂ, સેનાના હેલિકોપ્ટરની મદદથી કરાયું રેસ્ક્યૂ #Jamnagar #rescue #viralvideo #ZEE24KALAK #GujaratRains #flood pic.twitter.com/delowwfPjb
— Zee 24 Kalak (@Zee24Kalak) August 28, 2024
ఇక గుజరాత్ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు నదుల్లో నీటి మట్టం పెరిగి పరివాహక ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సూరత్, వడోదర నగరాల్లో వరద ఉద్ధృతి ఎక్కువగా కనిపిస్తోంది. రాజధాని గాంధీనగర్‌లోనూ రోడ్లపైకి నీరు చేరింది. వడోదరలో విశ్వమిత్రి నదిలో నీట మట్టం ప్రమాదకర స్థాయిలో పెరగడంతో నగరంలో ఏడు వంతెనలను మూసివేశారు. నది పక్కనే ఉన్న అనేక ఇళ్లు నీట మునిగాయి. డైమండ్ సిటీ సూరత్‌లోనూ లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది.