యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది తీవ్రమైన అనారోగ్య సమస్యగా చెప్పవచ్చు. మన శరీరంలో ప్యూరిన్లు అధికంగా పెరిగినప్పుడు ఈ సమస్య అనేది ఎక్కువగా వస్తుంది. ముఖ్యంగా ఇది మన ఆరోగ్యం పైన ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. యూరిన్ ఇన్ఫెక్షన్ అధికంగా ఉండడం ద్వారా మన ఎముకలు కీళ్లనొప్పి పెంచుతాయి. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడం, మూత్రం పోసేటప్పుడు మంట వంటివి కూడా ఇన్ఫెక్షన్ కిందికి వస్తాయి. వీటిని తగ్గించడంలో ఈ డ్రింక్స్ చాలా బాగా ఉపయోగపడతాయి.
Health Tips: కీర దోసకాయ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా.
అల్లం టి- చిన్న అల్లం ముక్కను నీటిలో వేసి మరిగించి ఖాళీ కడుపుతో తీసుకున్నట్లయితే యూరిన్ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, యాంటీ ఫంగల్ లక్షణాలు వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ తగ్గిపోతాయి, యూరిన్ మంటను కూడా తగ్గించడంలో సహాయపడుతుంది, అల్లం జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది, రక్తప్రసరణ పెంచుతుంది, ఇది మన శరీరంలో ఉండే టాక్సిన్స్ ను బయటకు పంపించడంలో సహాయపడి మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది సహజ నొప్పి నివారణగా పనిచేస్తుంది కాబట్టి దీన్ని తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది, దీని ద్వారా యూరిన్ ఇన్ఫెక్షన్ల సమస్య తగ్గుతుంది.
ఆపిల్ సైడర్ వెనిగర్- ఆపిల్ సైడర్ వెనిగర్ ను గోరువెచ్చటి నీటిలో 10 ml కలుపుకొని ప్రతిరోజు తీసుకోవడం ద్వారా యూరిన్ ఇన్ఫెక్షన్ సమస్యలన్నీ తగ్గిపోతాయి. ఇవి జీలక్రియను మెరుగు పరుస్తుంది. మన శరీరంలో మంటను తగ్గిస్తుంది అంతేకాకుండా మూత్ర సంబంధ వ్యాధులను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. మీ శరీరంలో ఉన్న విషయాలను తొలగిస్తుంది. రెగ్యులర్గా దీన్ని తీసుకోవడం ద్వారా అధిక బరువుతో బాధపడే వారికి కూడా చక్కటి పరిష్కారంగా చెప్పవచ్చు. అయితే దీన్ని ఎక్కువ మొత్తంలో తీసుకోకూడదు. దీని వల్ల దంతాలపైన ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా దీన్ని నీరు కలిపి తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది.
గ్రీన్ టీ- గ్రీన్ టీ ని ఒక కప్పు ప్రతి రోజు తీసుకోవడం ద్వారా ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతాయి. ఇవి యూరిన్ సమస్యలను నొప్పి సమస్యలను తగ్గిస్తాయి. మూత్రపిండాల్లో రాళ్లు మూత్రం ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. ఇది మన శరీరంలో వాపును తగ్గించడంలో సహాయపడుతుంది . ఈ డ్రింక్స్ ను మీరు భాగం చేసుకోవడం ద్వారా యూరిన్ ఇన్ఫెక్షన్ సమస్యను తగ్గించుకోవచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు వీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి