మన శరీరానికి ఎంతో ముఖ్యమైన విటమిన్లలో విటమిన్ డి చాలా ప్రముఖ స్థానంలో ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి ,ఎముకల బలానికి, కండరాలను నిర్మాణానికి సహాయపడుతుంది. అయితే విటమిన్-డిని సప్లిమెంటరీ రూపంలో కాకుండా సహజ పద్ధతుల్లో మన వంట గదిలో కూడా అనేక రకాల ఆహారాల్లో ఉన్నాయి. ఇవి విటమిన్ డి కి మంచి మూలంగా చెప్పవచ్చు. సహజంగా లభించే డి విటమిన్ సోర్సెస్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
పాల ఉత్పత్తులు- పాలు పెరుగు జున్ను వెన్న ఇవన్నీ కూడా విటమిన్ డి కి మంచి వనరులుగా చెప్పవచ్చు. ప్రతిరోజు వీటిని మనం ఏదో ఒక రూపంలో తీసుకున్నట్లయితే మన ఎముకల బలోపేతానికి సహాయపడుతుంది. క్యాల్షియం గ్రహించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా ఆవుపాలలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది.
గుడ్డు పచ్చ సొన- కోడిగుడ్డులోని పచ్చ సొన లో విటమిన్-డి అత్యధికంగా ఉంటుంది. ఇది ఎముకలకు దంతాలకు అవసరమైన కాల్షియన్ని అందిస్తుంది. అంతేకాకుండా మన శరీరానికి కావలసిన టి విటమిన్ ను అందిస్తుంది.
పుట్టగొడుగులు- పుట్టగొడుగుల్లో కూడా విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. ఇది సూర్యకాంతిలో పెరిగే పుట్టగొడుగుల్లో విటమిన్ డి చాలా అత్యధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి ఎముకల ఆరోగ్యానికి కణం నిర్మాణానికి కండరాల పెరుగుదలకు సహాయపడుతుంది.
నువ్వులు- నువ్వులలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి సహాయపడుతుంది. అంతేకాకుండా ఇందులో కాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది. నువ్వులు ముఖ్యంగా ఎముకల బలానికి శరీర ఎదుగుదలకు సహకరిస్తుంది.
విటమిన్ డి ప్రయోజనాలు- విటమిన్ డి కాల్షియమ్ ని గ్రహించడంలో సహాయపడుతుంది. కండరాల నిర్మాణానికి ఎముకల వ్యాధులను తగ్గించడానికి ఎముకల బలోపేతను పెంచడానికి సహాయపడుతుంది. విటమిన్ డి వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇన్ఫెక్షన్ల బారి నుండి బయటపడుతాము. అనేక రకాలైనటువంటి బ్యాక్టీరియా వైరస్ల నుండి మన శరీరం రక్షించబడుతుంది. విటమిన్-డి తగ్గితే గుండె జబ్బులు రక్తపోటు వంటి సమస్యలు వస్తాయి. మానసిక ఆరోగ్యం పైన కూడా డి విటమిన్ సంబంధాన్ని కలిగి ఉంటుంది. డిప్రెషన్ తో బాధపడే వారికి విటమిన్ డి లోపం అని చెప్పవచ్చు. విటమిన్ డి సరైన స్థాయిలో లేకుంటే టైప్ 2 డయాబెటిస్ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతే కాకుండా కొన్ని రకాల క్యాన్సర్లు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి విటమిన్ డి అనేది మన శరీరానికి చాలా ముఖ్యమైన విటమిన్ ఇది దీని లోపం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. పాలు పుట్టగొడుగులు గుడ్డు, చేపలు, బొద్దుతిరుగుడు గింజలు నువ్వులు వంటి సహజ ఆహార పదార్థాలలో విటమిన్ పుష్కలంగా ఉంటుంది. వీటిని మీరు ప్రతిరోజు ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా డి విటమిన్ లోపాన్ని అధిగమించవచ్చు.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి