బీట్రూట్ అనేకరకాల పోషకాలు కలిగి ఉన్న ఒక ఆహారంగా చెప్పవచ్చు. ఇందులో విటమిన్లు, మినరల్స్ ,యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబరు పుష్కలంగా ఉంటాయి. ఇది మన ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా అందాన్ని కూడా పెంచుతుంది. అనేక రకాల జబ్బులను తగ్గించడం చాలా సహాయపడుతుంది. ఉదయాన్నే బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఇమ్యూనిటీ పెరుగుతుంది- ఈ మధ్యకాలంలో తరచుగా మారుతున్న వాతావరణం వల్ల జలుబు, దగ్గు ,జ్వరం వంటి ఇన్ఫెక్షన్ల ప్రమాదం రోజురోజుకు పెరుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో రోగనిరోధక శక్తిని పెంచుకోవడమే మన ముందున్న మార్గం సీజనల్ అనేక రకాల వ్యాధులను తగ్గించడానికి మన రోగనిరోధక వ్యవస్థను పెంచుకోవాలి. కాబట్టి ప్రతిరోజు ఒక గ్లాసు బీట్రూట్ తాగితే రోగనిరోధక వ్యవస్థ పెరుగుతుంది. ఇందులో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడం వల్ల ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
ఎసిడిటీ- తరచుగా గ్యాస్ గుండెల్లో మంట ఎసిడిటీ అజీర్ణం అంటే సమస్యలతో బాధపడే వారికి బీట్రూట్ జ్యూస్ ఒక అద్భుత ఔషధంగా పనిచేస్తుంది. ఇది మన జీవ క్రియను మెరుగుపరుస్తుంది. జీర్ణ వ్యవస్థలో ఉండే లోపాలను తగ్గిస్తుంది. పెద్ద పేగు క్యాన్సర్ రాకుండా చేస్తుంది.
Health Tips: బ్లాక్ కాఫీ నిజంగా బరువును తగ్గిస్తుందా..
బీపీని తగ్గిస్తుంది- ప్రతిరోజు బీట్రూట్ రసాన్ని తీసుకోవడం ద్వారా అధిక రక్తపోటు సమస్యతో బాధపడే వారికి ఇది చక్కటి రెమిడిగా చెప్పవచ్చు. ఇందులో నైట్రిక్ ఆక్సైడ్ పుష్కలంగా ఉంటుంది. దీని ద్వారా రక్తనాళాల్లో పెరిగిన రక్తపోటు ఒత్తిడిని తగ్గిస్తుంది. గుండె జబ్బులకు రక్తపోటు ప్రధాన కారణం అని చెప్పవచ్చు. అటువంటి అప్పుడు బీట్రూట్ జ్యూస్ నీకు అమౌంట్ తప్పకుండా తాగినట్లయితే గుండెపోటు వచ్చే ప్రమాదాలు తగ్గుతాయి.
చర్మానికి మంచిది- చర్మ సమస్యలు తగ్గించుకోవడానికి బీట్రూట్ రసం ఒక అద్భుత వరంగా చెప్పవచ్చు. బీట్రూట్ డ్రెస్ అని ప్రతి రోజు తీసుకోవడం వల్ల ఇందులో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలో పేరుకుపోయిన మలినాలను తొలగించి మన చర్మ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. అంతేకాకుండా ఇది యాంటీ ఏసింగా కూడా పనిచేస్తుంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి