Representative Image (Photo Credits: File Photo)

క్యాలీఫ్లవర్ లో అనేక పోషకాలు ఉన్నాయి. ఇది శాఖాహారులకు ఒక చక్కటి ఎంపిక అని చెప్పవచ్చు. ఇందులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. అనేక వ్యాధుల నుండి దూరంగా ఉంచడంలో క్యాలీఫ్లవర్ సహాయపడుతుంది. అయితే కాలీఫ్లవర్ లో ఉన్న ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ప్రోటీన్- ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం మన శరీరానికి ప్రోటీన్ చాలా ముఖ్యం. మాంసాహారులకు ప్రోటీన్ మాంసం, కోడిగుడ్లు ద్వారా దొరుకుతుంది. అయితే శాకాహారులకు క్యాలీఫ్లవర్ అనేది గొప్ప ఎంపిక అని చెప్పవచ్చు. 100 గ్రాముల క్యాలీఫ్లవర్ లో 3 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అయితే క్యాలరీలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను సక్రమంగా ఉంచడంలో సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునే క్యాలీఫ్లవర్ ఒక చక్కటి ఎంపిక.

క్యాన్సర్ ను తగ్గిస్తుంది- క్యాలీఫ్లవర్ ను తీసుకోవడం ద్వారా మనకు యాంటీ ఆక్సిడెంట్ లో పుష్కలంగా లభిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్ వల్ల శరీరంలో క్యాన్సర్ కణాలు రాకుండా నియంత్రిస్తుంది. క్యాలీఫ్లవర్ ను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా క్యాన్సర్ ప్రమాదాన్ని చాలా వరకు తగ్గించవచ్చు.

Health Tips: చలికాలంలో విటమిన్ డి లోపం సమస్య ఏర్పడుతుంది. 

ఎముకలకు బలం- క్యాలీఫ్లవర్ లో క్యాల్షియం కొల్లాజిన్ అధిక పరిమాణంలో ఉంటుంది. ఇది ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఇందులో విటమిన్ కే అధికంగా ఉంటుంది. ఇది ఎముకల వ్యాధి రాకుండా ఉంచడంలో సహాయపడుతుంది.

రోగ నిరోధక శక్తిని పెంచుతుంది- రోగనిరోధక శక్తిని పెంచడంలో క్యాలీఫ్లవర్ మొదటి స్థానంలో ఉంటుంది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది చలికాలంలో వచ్చే జలుబు ,దగ్గు వంటి సాధారణ సమస్యల నుంచి రక్షించడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

క్యాలీఫ్లవర్ ను ఎలా తీసుకోవాలి.. క్యాలీఫ్లవర్ కూర రూపంలో తీసుకోవచ్చు. లేదా సూప్ రూపంలో తీసుకోవచ్చు. ఇతర కూరగాయలతో కూడా కలిపి వండుకోవచ్చు. లేదా లైట్ గా ఫ్రై చేసుకుని అల్పాహారంగా కూడా తీసుకోవచ్చు. ఇందులో ప్రోటీన్ పోషక విలువలో అధికంగా ఉంటాయి. ఇది బరువు నియంత్రణలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి