మన శరీరం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనకి పోషకాలతో పాటు కొన్ని రకాలైన పోషకాలు కూడా అవసరం అందులో జింక్ అనేది చాలా ముఖ్యం. ఇది దీనిలోపం వల్ల మన శరీరం చాలా బలహీనంగా మారుతుంది. అనేకరకాల జబ్బులు బారిన పడతారు. జింక్ మన శరీరము సొంతంగా ఉత్పత్తి చేయదు. మనం తీసుకునే ఆహారంలో కొన్ని అంశాలను చేర్చుకోవడం ద్వారా జింక్ పుష్కలంగా లభిస్తుంది.

జింక్ లోపం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు- జింక్ లోపం వల్ల బరువు తగ్గడం మానసిక ఆరోగ్యం పైన కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. అంతేకాకుండా జుట్టు రాలడం, చర్మం తెల్లగా మారడము,గాయాలు తొందరగా మానకపోవడం,ఆకలి లేకపోవడం, రుచి ,వాసన తగ్గిపోవడం, తరచుగా మలబద్దకం లేదా విరోచనాల వంటి సమస్యలు ఏర్పడతాయి.

జింక్ అధికంగా ఉండే ఆహార పదార్థాలు..

కోడిగుడ్డు- కోడిగుడ్డులో జింక్ అధికంగా ఉంటుంది. ముఖ్యంగా కోడి గుడ్డలోని పచ్చ సన్నలో ఇవి అధికంగా ఉంటుంది. పచ్చ సొన తినడం ద్వారా జింకుతో పాటు విటమిన్ b6, విటమిన్ బి 12 ,క్యాల్షియం ,ఐరన్, ఫాస్పరస్ కూడా మన శరీరానికి అందుతుంది.

Health Tips: మహిళల్లో అవాంఛిత రోమాలు రావడానికి కారణాలేంటి తెలుసుకుందాం.

పెరుగు- ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో కచ్చితంగా పెరుగుని తీసుకోవాలి. ఇందులో గట్ బ్యాక్టీరియా ఉంటుంది. ఇది మన జీర్ణ క్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది. రోగనిరోధక వ్యవస్థను పెంచుతుంది. ఈ ప్రతిరోజు పెరుగు తీసుకోవడం వల్ల జింక్ లెవెల్స్ కూడా పెరుగుతాయి.

వెల్లుల్లి- వెల్లుల్లిలో జింక్ అధికంగా ఉంటుంది. దీన్ని తీసుకోవడం ద్వారా మన శరీరానికి విటమిన్ సి, ఐరన్ ,పొటాషియం, విటమిన్ ఏ, విటమిన్ బి ,అయోడిన్ కూడా అందుతాయి. దీని తీసుకోవడం ద్వారా జింక్ లోపం నుంచి బయటపడవచ్చు.

బాదంపప్పు- బాదంపప్పులో అనేక రకాల పోషకాలు ఉంటాయి ఇందులో విటమిన్ ఏ కే ,జింక్ పుష్కలంగా ఉంటుంది. ఇది చలికాలంలో ఎక్కువగా తింటూ ఉంటారు.ఇది రోగనిరోధక వ్యవస్థను పెంచుతుంది. జింక్ లోపాన్ని తగ్గిస్తుంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి