ఐరన్ మన శరీరానికి చాలా ముఖ్యమైన మూలకం. ఐరన్ లోపం వల్ల రక్తహీనత ,ఎనీ మియా, హిమోగ్లోబిన్ లోపం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఐరన్ ఉన్న ఆహార పదార్థాలను మనము గుర్తించి వాటిని తీసుకోవడం ద్వారా ఈ ఐరన్ లోపాన్ని తగ్గించుకోవచ్చు. ఐరన్ లోపం వల్ల బలహీనత అలసట కళ్ళు తిరగడం తలనొప్పి వంటి సమస్యలు ఏర్పడతాయి. ఐరన్ అధికంగా ఉన్న ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఖర్జూర- ఖర్జూర పండులో ఐరన్ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఖర్జూర పండ్లను ప్రతిరోజు ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా మీ శరీరంలో ఉన్న ఐరన్ లోపం తగ్గుతుంది. దీని ద్వారా మీకు ఇన్ఫెక్షన్స్ అలసట నీరసం అంటే సమస్యలు కూడా దూరమవుతాయి. తినడం ద్వారా తక్షణ శక్తి కూడా లభిస్తుంది.
Health Tips: చలికాలంలో ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉంటే మంచిది..
ఉసిరి- ఉసిరిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది ఐరన్ శోషణకు సహాయపడుతుంది. అంతేకాకుండా రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. అనేక రకాల జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సీజనల్ వ్యాధులను రాకుండా చేస్తుంది.
బీట్రూట్- ఇది ఒక దుంప కూరగాయ. ఇది ఇందులో ఐరన్, జింక్ ,ఫోలిక్ ,యాసిడ్ వంటివి పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజు దీన్ని ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా మీకు ఐరన్ లోపం సమస్య నుంచి బయటపడతారు. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. రక్తంలో పేరుకుపోయిన టాక్సిన్స్ ను బయటకు పంపించి రక్త శుద్ధికి తోడ్పడుతుంది. దీని ద్వారా మీ చర్మం నిగరింపును సంతరించుకుంటుంది.
అవిస గింజలు- ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా ఐరన్, ఫోలేట్, మెగ్నీషియం వంటివి పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం ద్వారా ఐరన్ లోపం సమస్య నుంచి బయటపడవచ్చు. అంతేకాకుండా కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా అవిసె గింజలు తగ్గిస్తాయి.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి