liver

ఈ మధ్యకాలంలో ఫ్యాటీ లివర్ అనే సమస్య సర్వసాధారణమైంది. వారు కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. అయితే ఫ్యాటీ లివర్ సమస్య ప్రధానంగా అధిక బరువు, కొలెస్ట్రాల్, మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఫ్యాటీలివర్ ను సమస్యను సకాలంలో గుర్తించడం ముఖ్యం.

ఎందుకు వస్తుంది-   ఫ్యాటీ లివర్అనే సమస్య కాలయంలో కొవ్వు పేరుకుపోయినప్పుడు ఈ సమస్య ఏర్పడుతుంది. ముఖ్యంగా కాలేయం సరిగ్గా పని చేయనప్పుడు ఈ సమస్య ఏర్పడుతుంది. దీని అశ్రద్ధ చేయకుండా వెంటనే సకాలంలో చికిత్స తీసుకోకపోతే ఇతర తీవ్రమైన కాలయ వ్యాధులకు కారణం అవుతుంది. అయితే మన ఆహారము జీవనశైల్లో మార్పుల ద్వారా ఫ్యాటీ లివర్ సమస్యను నియంత్రించుకోవచ్చు. పార్టీ లివర్ ఉన్నవారు ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి.

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్- ఫ్యాటీ లివర్ ఉన్నవారు ఎక్కువగా ఆకుకూరలు తీసుకోవాలి ముఖ్యంగా బచ్చలి కూర మెంతుకూర వంటివి తీసుకోవాలి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఫైబర్ కూడా అధికంగా ఉండడం వల్ల ఇది కాలయానికి చాలా మంచిది.

పండ్లు-  ఆపిల్, బొప్పాయ, ఆరెంజ్ వంటి పనులలో ఫ్యాటీ లివర్ను తగ్గించే గుణాలు ఉన్నాయి. ఇందులో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే ఆంటీ ఆక్సిడెంట్లు ఫ్యాటీ లివర్ ను తగ్గించడంలో సహాయపడతాయి.

ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్- అవిస గింజలు, వాల్నట్స్, చియా గింజల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ చాలా అధికంగా ఉంటాయి. ఇవి తీసుకోవడం ద్వారా మీ ఫ్యాటీ లివర్ సమస్యను తగ్గించుకోవచ్చు.

ఫ్యాటీ లివర్ ఉన్నవారు ఏ ఆహార పదార్థాలు తినకూడదు.

ప్రాసెస్ చేసిన ఫుడ్- ఫాస్ట్ ఫుడ్, ప్యాక్ చేసిన స్నాక్స్ ,బిస్కెట్స్ ,ఫ్రోజెన్ ఫుడ్స్ వంటివి తీసుకోకూడదు. ఇవి మీకు ఆలయానికి మరింత హానిని కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇందులో అనారోగ్యకరమైన కొవ్వులు ,నూనెలో కలిగి ఉంటాయి.

ఆల్కహాల్- ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడే వారికి ఆల్కహాల్ అనేది ఒక పెద్ద కారణంగా చెప్పవచ్చు. దీన్ని పూర్తిగా మానివేయాలి. దీనిద్వారా మీ ఫ్యాటీ లివర్ సమస్యలు తగ్గించుకోవచ్చు.

Health Tips: మెంతుల కషాయం తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు .

డీప్ ఫ్రై ఆహారాలు- ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడేవారు డీప్ ఫ్రైడ్ ఆహారాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకోవద్దు. దీన్ని తీసుకోవడం ద్వారా మీ కాలేయంలో ఫ్యాట్ మరింతగా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వేయించిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి.

సహజంగా లివర్ ఫ్యాట్ ను తగ్గించుకోవడం ఎలా

ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారు బరువు తగ్గడం ద్వారా ఈ సమస్యను దాదాపు 5 నుండి 10% తగ్గించుకోవచ్చు. రెగ్యులర్  వ్యాయామం చేయాలి కనీసం రోజు 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడం, సైక్లిం,గ్ యోగ, నడక వంటి వాటితో ఫ్యాటీ లివర్ సమస్యను తగ్గించుకోవచ్చు. తగినంత నిద్రపోవాలి. ప్రతిరోజు కూడా ఎనిమిది గంటల నిద్ర వల్ల ఒత్తిడి తగ్గుతుంది.  ప్రతిరోజు 8 నుండి 10 క్లాసుల నీరు తాగడం వల్ల ఆలయంలో పేర్కొన్న టాక్స్ అన్నీ కూడా బయటికి పోయి కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.