New Delhi, May 27: తూర్పు లదాఖ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు అంతకంతకు తీవ్రతరమవుతున్నాయి. రెండు వారాల క్రితం ఈ ప్రాంతంలో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ కొందరిని గాయాలపాలు చేసింది. లదాఖ్‌లోని గాల్వన్ లోయలో (India-China LAC Standoff) చైనా ఇటీవల 100 తాత్కాలిక శిబిరాలను ఏర్పాటు చేసింది. సిక్కిం, టిబెట్‌లను కలిపేనుకులా పాస్ మార్గంలోనూ ఉద్రిక్తతల్ని పెంచి పోషిస్తోంది. భారత్‌కు కేవలం 3 కి.మీ. ఆవల పాంగాంగ్ సరస్సు సమీపంలోని 1,200 నుంచి 1,300 సైనికుల్ని మోహరించింది. చైనాలో కరోనా పోలేదు, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి, సవాళ్లను ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండాలి, కీలక వ్యాఖ్యలు చేసిన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్
మొత్తంగా భారత సరిహద్దుల్లో 5 వేలమంది వరకు సైనికుల్ని మోహరించింది. చైనా చర్యలతో భారత్ కూడా అప్రమత్తమైంది. వాస్తవాధీన రేఖ మీదుగా బలగాలను పటిష్టం చేసింది. భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే (Manoj Mukund Naravane) తూర్పు లదాఖ్ ప్రాంతంలో ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని సమీక్షిస్తున్నారు. చైనాతో సరిహద్దు వివాదాలు ముదిరిపోతున్న సందర్భంగా ఆర్మీ చీఫ్ నరవాణే ఆర్మీ కమాండర్లతో (Top Commanders of Indian Army) బుధవారం సమావేశమయ్యారు. ఈ సమావేశం వరుసగా మూడు రోజుల పాటూ జరగనుంది. లడఖ్ ప్రాంతంలో చైనా మిలటరీ తిష్ఠ వేయడం, సరిహద్దు రక్షణ... ఇలా అత్యంత కీలక అంశాలపై చర్చించనున్నారు. ఇక చైనాతో భారత్ పంచుకున్న సరిహద్దు ప్రాంతాల్లోనూ భారత్ ఇప్పటికే గస్తీని ముమ్మరం చేసింది. సరిహద్దుల్లోని సున్నిత ప్రాంతాలకు భారత్ అదనపు బలగాలను కూడా పంపుతోంది. ఈ విషయం కూడా కమాండర్ల సమావేశంలో నరవాణే లేవనెత్తనున్నారు.
భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు అంతకంతకూ తీవ్రతరం కావడం, టిబెట్‌లో వైమానిక స్థావర విస్తరణ పనుల శాటిలైట్ చిత్రాలు బయటకి వచ్చిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఉన్నతస్థాయి సమావేశం జరిపారు. దీంతోపాటు లదాఖ్‌లో నెలకొన్న పరిస్థితులపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ రావత్, త్రివిధ దళాధిపతులతోపాటు విదేశాంగ కార్యదర్శి హర్ష వర్ధన్ ష్రింగ్లాతోనూ చర్చించారు. కరోనాను ఖతం చేసే వ్యాక్సిన్ ఇదేనా?, శుభవార్త చెప్పిన ఇటలీ, ఎలుకలపై కరోనా వ్యాక్సీన్ ప్రయోగం విజయవంతమయిందని ప్రకటన, వేసవి తర్వాత క్లినికల్ ట్రయల్స్
మనదేశం చైనాతో 3,488 కిలోమీటర్ల మేర సరిహద్దును పంచుకుంటున్నది. దీనిని వాస్తవాధీన రేఖ (LAC) అని పిలుస్తున్నారు. ఇది లఢక్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ మీదుగా సాగుతుంది. 1962 భారత్-చైనా యుద్ధం తర్వాత మొదట్లో ఈ ప్రతిపాదనను ఒప్పుకొన్న చైనా.. ఇప్పుడు అడ్డం తిరుగుతున్నది. ఎల్‌ఏసీ 2000 కిలోమీటర్లకు మించదని చెప్తున్నది. ఏకంగా అరుణాచల్ ప్రదేశ్ తమదేనని వాదిస్తున్నది. లఢక్, సిక్కింలోని పలు ప్రాంతాలు కూడా తమకు చెందినవేనని వితండవాదన చేస్తున్నది. తరుచూ చైనా సైనికులు భారత భూభాగంలోకి చొరబడటం, కొన్ని ప్రాంతాలు తమవేనంటూ మ్యాపులు విడుదల చేయడం వంటి చర్యలకు దిగుతున్నది. భారత్ సమర్థంగా తిప్పికొడుతుండటంతో తోకముడుస్తున్నది. కరోనావైరస్ మానవ సృష్టే, చైనా వుహాన్ ల్యాబొరేటరీ నుంచి ఈ వైరస్ బయటకు వచ్చింది, నోబెల్ గ్రహీత మాంటగ్నియర్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఈ నేపథ్యంలోనే భారత్, చైనా సరిహద్దుల్లో 3,500 కిలో మీటర్ల ప్రాంతంలో చేపట్టిన మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన అభివృద్ధి ప్రాజెక్టుల్ని నిలిపివేసే ప్రసక్తే లేదని భారత్ తేల్చి చెప్పింది. ఈ ప్రాజెక్టుల్ని (Infrastructure Development) ఆపేయాలంటూ చైనా చేసిన హెచ్చరికల్ని పట్టించుకోబోమని స్పష్టం చేసింది. సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరుదేశాల సైనికులు కొద్ది రోజులుగా ఆరు దఫాలుగా జరిపిన చర్చలు కూడా విఫలమయ్యాయి. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్‌తో వరస సమావేశాలు నిర్వహిస్తూ వచ్చారు. లదాఖ్, సిక్కిం, ఉత్తరాఖండ్, అరుణాచల్ సరిహద్దుల్లో నిర్మిస్తున్న కీలకమైన ప్రాజెక్టులేవీ ఆపాల్సిన పని లేదని రాజ్‌నాథ్ సింగ్ ఆర్మీ ఉన్నతాధికారులతో స్పష్టం చేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఇండియా కొత్త ఎఫ్‌డీఐ రూల్స్, ఆవేశం వెళ్లగక్కిన చైనా
ఈ పరిస్థితులు ఇలా ఉంటే లదాఖ్ సరిహద్దుల్లో చైనా ఒక వైమానిక స్థావరాన్ని శరవేగంగా విస్తరిస్తోంది. మే 5న భారత్, చైనా మధ్య సైనికులు ఘర్షణ పడిన పాంగాంగ్ సరస్సు ప్రాంతానికి 200 కి.మీ. దూరంలో ఎయిర్ బేస్ నిర్మాణ పనులకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలు వెలుగులోకి వచ్చాయి. మొదటి చిత్రం ఈ ఏడాది ఏప్రిల్ 6న తీస్తే, రెండోది మే 21న తీశారు. హెలికాప్టర్లు దిగడానికి వీలుగా నిర్మించిన ట్రాక్ రెండో చిత్రంలో చూడొచ్చు. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఎయిర్‌ఫోర్స్‌కి చెందిన జే–11 లేదంటే జే–16 యుద్ధ విమానాలు నాలుగు వరసగా ఉండడం కనిపిస్తోంది. ఈ పరిణామాలు కలవరాన్ని పెంచుతున్నాయి. అమెరికాలో కరోనా మృత్యుఘోష, తరుముకొస్తున్న ఆర్థిక సంక్షోభం
మరోవైపు నేపాల్‌ను భారత్‌పైకి చైనా ఎగదోస్తున్నది. గత ఏడాది అక్టోబర్‌లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ నేపాల్‌లో పర్యటించారు. అప్పటి నుంచి నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ స్వరం మారింది. కాలాపానీ ప్రాంతం తమదే అంటూ మ్యాప్‌లు సిద్ధం చేసింది. మానస సరోవర యాత్ర కోసం లిపులేఖ్ కనుమ గుండా భారత్ నిర్మించిన రోడ్డుపై అభ్యంతరం తెలుపుతున్నారు.
కరోనా వైరస్ చైనాలోని వూహాన్ ల్యాబ్ నుంచి వచ్చిందని పదే పదే ఆరోపిస్తున్న అమెరికా ప్రపంచంలో చైనాని ఏకాకిని చేయడానికి భారత్ వంటి దేశాల సహకారం తీసుకుంటోంది. వైరస్ పుట్టుక, ప్రపంచ దేశాలను హెచ్చరించడంలో డబ్ల్యూహెచ్‌ఓ వైఫల్యం వంటి అంశాలపై విచారణ జరిపించే తీర్మానానికి భారత్, మరో 62 దేశాలు మద్దతు పలికాయి. అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలతో చేతులు కలపొద్దని చెప్పడానికే లదాఖ్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల్ని రాజేసి భారత్‌కు ఒక హెచ్చరికలా చైనా పంపుతోంది.
ఈ పరిస్థితుల్లో ఇండియా కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ అవుతూ చైనా చర్యల్ని తిప్పి కొడుతూ వస్తోంది. వాస్తవాధీన రేఖ వద్ద భారత బలగాలను అప్రమత్తం చేస్తూ వస్తోంది.