COVID-19 Vaccine: కరోనాను ఖతం చేసే వ్యాక్సిన్ ఇదేనా?, శుభవార్త చెప్పిన ఇటలీ, ఎలుకలపై కరోనా వ్యాక్సీన్ ప్రయోగం విజయవంతమయిందని ప్రకటన, వేసవి తర్వాత క్లినికల్ ట్రయల్స్
Coronavirus Vaccine (Photo Credits: ANI)

Rome, May 6: ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్-19 (COVID-19) మరణ మృదంగం మోగుతున్న వేళ ఇటలీ ప్రభుత్వం (Italy Govt) శుభవార్త చెప్పింది. ప్రపంచంలోనే తొలిసారిగా మానవులపై పనిచేయగల కరోనా వైరస్ వ్యాక్సీన్‌ను (COVID-19 Vaccine) అభివృద్ధి చేసినట్టు ప్రకటించింది. కరోనా వైరస్‌కు తాము వ్యాక్సిన్ తయారు చేసినట్టు ఇటలీ చేసిన ప్రకటనతో ప్రపంచం మొత్తం అటువైపు దృష్టి సారించింది. ఇటలీ ఈ ప్రకటన చేయగానే కరోనా బాధిత దేశాల్లో ఆశలు రేకెత్తాయి. టకీస్ అనే సంస్థ అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్‌ను ఎలుకలపై ప్రయోగించగా అద్భుతమైన ఫలితాలు కనిపించినట్టు న్యూస్ ఏజెన్సీ తెలిపింది.

రోమ్‌లోని స్పల్లంజానీ ఆస్పత్రిలో నిర్వహించిన పరీక్షల్లో... ఈ వ్యాక్సీన్ ఎలుకల్లో యాంటీబాడీలను ఉత్పత్తిచేస్తున్నట్టు గుర్తించారు. వ్యాక్సిన్ ప్రయోగంలో (coronavirus treatment) ఇది అడ్వాన్స్‌డ్ స్టేజ్ అని టకీస్ సీఈవో లుయిగి ఆరిసిచియో (Luigi Aurisicchio) అన్నారు. ఈ వేసవి తర్వాత క్లినికల్ ట్రయల్స్ జరుగుతాయని ఆయన వివరించారు. ఈ వ్యాక్సిన్‌ను ఎలుకల్లో ఒక్క డోస్ ఎక్కించగానే వాటిలో యాంటీబాడీలు అభివృద్ధి చెందాయని, కరోనా వైరస్ మానవ కణాలకు సోకకుండా ఈ వ్యాక్సిన్ నిరోధించగలదని అరిసిచియో ఆశాభావం వ్యక్తం చేశారు. కోవిడ్-19కు వాక్సిన్ ఎప్పటికీ రాకపోవచ్చు! ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన నిపుణుల హెచ్చరిక, వైరస్‌తోనే ఎలా జీవించాలో సమాజం నేర్చుకోవాలని సూచన

నోవల్ కరోనా వైరస్‌ వ్యాక్సీన్‌కు సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న పరిశోధనల్లో ఇదే అతిపెద్ద ముందడుగు అని దీన్ని తయారు చేస్తున్న టకిస్ సంస్థ సీఈవో లుయిగి ఆరిసిచియో పేర్కొన్నారు.ఫలితాలు ప్రోత్సాహకరంగా, అంచనాలకు మించి ఉన్నాయని ఇటాలియన్ పరిశోధకులు వ్యాఖ్యానించారు. ఆరు రాష్ట్రాల్లో కరోనా విలయతాండవం, 50 వేలకు చేరువలో కరోనా కేసులు, దేశ వ్యాప్తంగా 1,694 మంది మృతి, 33,514 కరోనా యాక్టివ్‌ కేసులు

అమెరికన్ ఔషధ సంస్థ లీనియాఆర్ఎక్స్‌తో టకిస్ (Takis) మరింత మమ్మురంగా పరిశోధనలు సాగించనున్నట్టు అరిసిచియో పేర్కొన్నారు. కరోనా దెబ్బకు ఇటలీ చిగురుటాకులా వణుకుతోంది. దాదాపు 30వేల మంది ప్రాణాలు కోల్పోగా.. రెండు లక్షల మందికిపైగా వైరస్ బారినపడ్డారు.

ఇదిలా ఉంటే ఇజ్రాయెల్‌లోని టెల్‌అవీవ్‌ విశ్వవిద్యాలయం కేంద్రంగా పనిచేస్తున్న పరిశోధకుడు జోనాథన్‌ గెర్షోని నేతృత్వంలోని బృందం ఇటీవల కొవిడ్‌ వ్యాక్సిన్‌ డిజైన్‌ను రూపొందించినట్టు ప్రకటించింది. ఈ బృందంలో ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాకి చెందిన శాస్త్రవేత్త ఉప్పలపాటి లక్ష్మీనరసయ్య కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇజ్రాయెల్ రూపొందిచిన డిజైన్‌కి మార్చిలోనే అమెరికా పేటెంట్‌ కూడా ఇచ్చింది.