Covid In India: దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు, 175 కోట్లు దాటిన వ్యాక్సిన్లు, కొత్తగా పాజిటివ్ కేసులు ఏ రాష్ట్రంలో అధికంగా నమోదు అవుతున్నాయంటే...

భారత్ లో కరోనా థర్డ్ వేవ్ అనంతరం రోజువారి కేసుల సంఖ్య భారీగా తగ్గుతోంది. తాజాగా కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 22,270 మంది కరోనా బారిన పడగా.. 325 మంది మృతి చెందారు.

Covid In India: దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు, 175 కోట్లు దాటిన వ్యాక్సిన్లు, కొత్తగా పాజిటివ్ కేసులు ఏ రాష్ట్రంలో అధికంగా నమోదు అవుతున్నాయంటే...
COVID-19 Vaccination (Photo Credits: ANI)

భారత్ లో కరోనా థర్డ్ వేవ్ అనంతరం రోజువారి కేసుల సంఖ్య భారీగా తగ్గుతోంది. తాజాగా కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 22,270 మంది కరోనా బారిన పడగా.. 325 మంది మృతి చెందారు. గురువారం నమోదైన కేసులతో పోలిస్తే.. ఈరోజు నమోదైన కేసులు మరింత తగ్గాయి. ప్రస్తుతం దేశంలో 2,53,739 కేసులు యాక్టివ్ గా ఉండగా.. వారంతా హోం క్వారంటైన్లు, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

 వెనక్కి తగ్గిన రష్యా, ఉక్రెయిన్ స‌రిహ‌ద్దుల నుంచి బలగాలు ఉపసంహరణ, డ్రిల్స్ పూర్తి చేసుకున్న త‌ర్వాత దళాలు స‌రిహ‌ద్దు నుంచి వెన‌క్కి మ‌ళ్లాయని తెలిపిన రష్యా రక్షణ మంత్రి

ఇప్పటి వరకూ దేశంలో మొత్తం 4,28,02,505 కరోనా కేసులు నమోదవ్వగా.. మరణాల సంఖ్య 5,11,230కి చేరింది. భారత్ లో ఇప్పటి వరకూ 175.03 కోట్ల మందికి వ్యాక్సిన్ వేసినట్లు కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో డైలీ పాజిటివిటీ రేటు 1.8 శాతంగా ఉన్నట్లు కేంద్రం తెలిపింది. కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, మిజోరాం లలో అత్యధిక కేసులు నమోదయ్యాయి.

(The above story first appeared on LatestLY on Feb 19, 2022 01:13 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).