Rainfall -Representational Image | (Photo-ANI)

New Delhi, May 26: దేశంలో ఈసారి దాదాపు సాధారణ వర్షపాతమే నమోదు కానుందని భారత వాతావరణ విభాగం (IMD ) ఇవాళ వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) సాధారణంగా జూన్ 1-4 మధ్య కేరళ తీరాన్ని తాకుతాయి. ఎల్‌నినో (El Nino) ప్రభావం ఉండొచ్చనే అంచనాల నేపథ్యంలోనూ ఈ సారి జూన్‌-సెప్టెంబరులో సాధారణ వర్షపాతమే ఉంటుందని ఐఎండీ ఎన్విరాన్‌మెంట్ మానిటరింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్ చీఫ్ శివానంద పాయ్ వివరించారు. వ్యవసాయాధారిత భారత్‌ లో సగం కంటే అధిక ప్రాంతం నైరుతి రుతుపవనాల మీదే ఆధారపడుతుంది.

మొత్తం వర్షపాతంలో జూన్‌-సెప్టెంబరు మధ్య 70 శాతం వర్షపాతం పడుతుంది. ఈ సారి నైరుతి రుతుపవనాలు జూన్ 1 కంటే ముందుగా వచ్చే ముందుగా వచ్చే అవకాశాలు చాలా తక్కువని ఐఎండీ తెలిపింది. ఈ సారి నైరుతి రుతుపవానాలు కేరళను జూన్ 4న తాకే అవకాశం ఉందని అంచనా వేసింది.

Heatwave Ends in India: మండే ఎండలకు ఇక సెలవు, దేశంలో హీట్ వేవ్ ముగిసిందంటూ చల్లని కబురును చెప్పిన ఐఎండీ, ఇక నుంచి వర్షాలు కురుస్తాయని వెల్లడి 

ఈ సారి సాధారణ వర్షపాతం దీర్ఘకాల సగటులో 96 శాతంగా ఉండనుందని వెల్లడించింది. జూన్ లో దక్షిణాదిన, ఈశ్యాన్య భారత్, మరికొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని శివానంద పాయ్ తెలిపారు. కాగా, కేరళను తాకిన తర్వాత నైరుతి రుతుపవనాలు దేశంలోని పలు రాష్ట్రాల్లోకి ప్రవేశిస్తాయి. ఆ రుతుపవనాల ప్రవేశంతో వర్షాకాలం ప్రారంభమైందని భావిస్తాం.