Ranchi January 15: రోడ్లను హీరోయిన్‌ల బుగ్గలతో పోల్చడం రాజకీయ నాయకులకు అలవాటుగా మారింది. తాజాగా మరో నేత అదేరీతి వ్యాఖ్యలు చేశారు. జార్ఖండ్ (Jharkhand) రాష్ట్రంలోని జమ్తారా నియోజకవర్గ ఎమ్మెల్యే ఇర్ఫాన్ అన్సారీ (Irfan Ansari ) తన నియోజకవర్గంలోని రోడ్లన్నీ ఇక ముందు బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ బుగ్గల్లా నున్న (actor Kangana Ranaut’s cheeks)గా ఉంటాయని వ్యాఖ్యానించారు. ఈ మేరకు 14 వరల్డ్ క్లాస్ రహదారుల నిర్మాణం త్వరలో ప్రారంభం కానుందని చెప్పారు.
ఈ వ్యాఖ్యలను ఆయన ఏ సమావేశంలోనో, బహిరంగ సభలోనో, ప్రెసెమీట్‌లోనో చేయలేదు. తన ఇంట్లో కూర్చుని సెల్ఫీ వీడియో(Selfie video) తీసుకుంటూ చెప్పారు. అనంతరం ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వారం ప్రారంభంలోనే కరోనా ఉధృతి సమయంలో మాస్క్‌లు ఎక్కువ సేపు ధరించకూడదని, హానికరం అంటూ చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదానికి తెరలేపాయి.
#WATCH | Jharkhand: I assure you that roads of Jamtara "will be smoother than cheeks of film actress Kangana Ranaut"; construction of 14 world-class roads will begin soon..: Dr Irfan Ansari, Congress MLA, Jamtara
(Source: Self-made video dated January 14) pic.twitter.com/MRpMYF5inW
— ANI (@ANI) January 15, 2022
ఆ వివాదం సద్దుమణిగిపోక మునుపే తాజాగా మళ్లీ ఇలాంటి వివాదస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచాడు. అయితే రాజకీయనాయకులు తమకు ఇష్టమైన నటీమణులతో రహదారులను పోల్చడం కొత్తేమి కాదు. 2005లో, ఆర్‌జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, నటి హేమమాలిని చెంపలలాగా బీహార్ రోడ్లను సున్నితంగా చేస్తానని వాగ్దానం చేసినప్పుడు పెద్ద దుమారం రేగింది. అంతేకాదు గత నెల మహారాష్ట్ర మంత్రి సీనియర్ శివసేన నాయకుడు గులాబ్రావ్ పాటిల్ తన నియోజకవర్గంలోని రోడ్లను హేమా మాలిని చెంపలతో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో క్షమాపణలు చెప్పవలసి వచ్చిన సంగతి తెలిసిందే.