Kaun Banega Crorepati 16: Chander Prakash becomes season's first crorepati; fails to answer the Rs 7 crore question Watch Video

‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ (Kaun Banega Crorepati) 16వ సీజన్‌లో 22 ఏళ్ల జమ్మూకశ్మీర్‌ కుర్రాడు చందర్‌ ప్రకాశ్‌ రూ.కోటి గెలుచుకున్నాడు. ఈ సీజన్‌లో రూ.కోటి గెలిచిన తొలి కంటెస్టెంట్‌ గా నిలిచాడు. అయితే, రూ.7 కోట్ల ప్రశ్నకు కూడా సమాధానం తెలిసినప్పటికీ.. రిస్క్‌ తీసుకోకుండా గేమ్‌ నుంచి క్విట్‌ అయ్యాడు.కంటెస్టెంట్‌ చందర్‌ ప్రకాశ్‌ రూ.కోటి ప్రశ్న ఏంటంటే..‘‘ఏ దేశంలో అతిపెద్ద నగరం దాని రాజధాని కాదు కానీ.. ‘శాంతి నివాసం’ అనే అరబిక్‌ పేరుతో ఆ నగరం ఓ పోర్టును కలిగి ఉంది’’ అని వ్యాఖ్యాత అమితాబ్‌ ప్రశ్న అడిగారు.

తిరుపతిని ప్రత్యేక దేశంగా ప్రకటించాలని కేఏ పాల్ డిమాండ్, కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని కోర్టులో పిల్ వేసినట్లు తెలిపిన ప్రజాశాంతి పార్టీ అధినేత వీడియో ఇదిగో..

దీనికి ఎ. సోమాలియా, బి. ఒమన్‌, సి. టాంజానియా, డి. బ్రూనై నాలుగు ఆప్షన్లు ఇచ్చారు. ఇందులో చందర్‌ ప్రకాశ్‌ ‘డబుల్ డిప్‌’ లైఫ్‌లైన్‌ను ఉపయోగించుకుని ఆప్షన్‌ సి. టాంజానియాను ఎంచుకున్నాడు. అది సరైన సమాధానం కావడంతో రూ.కోటి గెలుచుకున్నట్లు బిగ్‌బీ ప్రకటించాడు. అమితాబ్‌ సీట్లో నుంచి లేచి అతడిని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నాడు. రూ.కోటితో పాటు అతడు ఓ కారును కూడా బహుమతిగా అందుకున్నాడు.

ఆ తర్వాత చందర్‌ ప్రకాశ్ రూ.7కోట్ల ప్రశ్నకు చేరుకున్నాడు. ‘‘1587లో ఉత్తర అమెరికాలో ఇంగ్లీష్‌ దంపతులను జన్మించిన మొట్టమొదటి బిడ్డ ఎవరు?’’ అని అమితాబ్‌ ప్రశ్నించాడు. దీనికి ప్రకాశ్‌కు జవాబు తెలియకపోవడంతో పాటు అప్పటికే లైఫ్‌లైన్లు అన్ని వినియోగించుకోవడంతో తప్పనిపరిస్థితుల్లో షో నుంచి క్విట్‌ అయ్యాడు. ఆ తర్వాత అమితాబ్‌ సరదాగా ఆ ప్రశ్నకు సమాధానం ఊహించమని అడిగారు. అతడు ఆప్షన్‌ ఎ. వర్జనీయా డేర్‌ అని చెప్పగా.. అదే సరైన జవాబు అని బిగ్‌బీ తెలిపారు. ప్రస్తుతం చందర్ యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. చిన్నప్పటి నుంచి తాను ఎన్నో ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నానని, పేగులో పూడిక కారణంగా ఇప్పటివరకు ఏడు సార్లు సర్జరీ చేయించుకున్నానని చెప్పాడు.