గతేడాది అక్టోబర్ 3న జరిగిన లఖింపూర్ ఖేరి హింసాత్మక ఘటనలో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కుంటున్న కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు బెయిల్ మంజూరు చేసేందుకు అలహాబాద్ హైకోర్టు నిరాకరించింది. బెయిల్ కోరుతూ ఆశిష్ దాఖలు చేసిన పిటిషన్‌పై జులై 15నే వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును మంగళవారం వెల్లడించింది. కాగా నిరసనలు చేస్తున్న రైతులపైకి కారు దూసుకెళ్లిన ఈ దుర్ఘటనలో నలుగురు అన్నదాతలు సహా 8 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఈ కేసులో గేతేడాది అక్టోబర్ 9నే అరెస్టయిన ఆయనకు అలహాబాద్ హైకోర్టు ఈ ఏడాది ఫిబ్రవరిలో బెయిల్ మంజూరు చేసింది. దీన్ని సవాల్ చేస్తూ రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఆశిష్ బెయిల్‌ను రద్దు చేసింది. మంత్రి కుమారుడు అయినందుకు కేసు విచారణను ప్రభావితం చేసే అవకాశముందని పేర్కొంది. ఇప్పుడు అలహాబాద్ హైకోర్టు కూడా అదే కారణంతో ఆశిష్‌కు బెయిల్ నిరాకరించింది.
Lakhimpur Kheri Violence: Allahabad High Court Rejects Bail Plea of Ashish Mishra #LakhimpurKheri #AllahabadHighCourt #AshishMishra https://t.co/eIDkF5pReI
— LatestLY (@latestly) July 26, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)