Leopard Enters Police Station: పోలీస్ స్టేషన్‌లో చిరుతపులి హల్‌చల్, సీసీటీవీలో రికార్డయిన చిరుత సంచారం, స్టేషన్‌లోకి వచ్చిన చిరుత చివరికి ఏం చేసిందంటే?
Leopard Enters Police Station (PIC@ X)

Mumbai, JAN 27: ఒక చిరుత పోలీస్ స్టేషన్‌లోకి ప్రవేశించింది. (Leopard Enters Police Station) దానిని చూసి పోలీస్‌ సిబ్బంది దాక్కున్నారు. అయితే అక్కడున్న కుక్కలు భయంతో పరుగులు తీశాయి. ఒక కుక్క వెంటపడిన ఆ చిరుత దానిని నోట కరుచుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ పోలీస్‌ స్టేషన్‌లోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బుధవారం రాత్రి వేళ రాజాపూర్ పోలీస్ స్టేషన్ ఆవరణలోకి చిరుత పులి వచ్చింది. అక్కడ తిరుగుతున్న కుక్కలు చిరుతను చూసి భయపడి పోలీస్‌ స్టేషన్‌లోకి వెళ్లాయి. చిరుత కూడా ఆ కుక్కలను వెంబడిస్తూ పోలీస్‌ స్టేషన్‌లోకి ప్రవేశించింది. ఒక గదిలోకి దూరిన కుక్కను నోట కరుచుకుంది. అనంతరం అక్కడి నుంచి ఆ చిరుత వెళ్లిపోయింది.

 

కాగా, చిరుత పోలీస్‌ స్టేషన్‌లోకి రావడం చూసి పోలీస్‌ సిబ్బంది కూడా భయాందోళన చెందారు. సురక్షిత ప్రాంతంలో వారు దాక్కున్నారు. చిరుత కుక్కను వేటాడి నోట కరుచుకుని వెళ్లిన తర్వాత వారంతా బయటకు వచ్చారు. మరోవైపు ఆ పోలీస్‌ స్టేషన్‌లోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.