
Bhopal, JAN 29: మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) పన్నా నగరానికి చెందిన ఓ బట్టల వ్యాపారి రాసిన సూసైడ్ నోట్ నగర వాసులను కంట తడి పెట్టిస్తున్నది. శనివారం తన భార్యను చంపి, తాను ఆత్మహత్య (Suicide) చేసుకున్నాడు. ఘటనా స్థలంలో పోలీసులు ఒక సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. భార్యాభర్తల శరీరాలపై బుల్లెట్ గాయాలు ఉన్నాయి. సంజయ్ సేథ్ (Sanjay Seth) అనే వ్యాపారవేత్త..ఆత్మహత్య చేసుకోవడానికి ముందు తన వద్ద అప్పు తీసుకున్న వ్యక్తి తిరిగి చెల్లించలేదని భోరుమంటూ వీడియో రికార్డు చేశాడు. ఆ వీడియోలో `నా పిల్లల భవితవ్యం కోసం దయచేసి నా డబ్బు ఇవ్వు. నా కూతురు మ్యారేజీ (Daughter marriage) ఉంది. ఆమె పెండ్లికి రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు ఖర్చవుతుంది. ఆమె ఖాతాలో రూ.29 లక్షలు ఉంది. అది బ్యాంక్ లాకర్‌లో ఉంది. నా భార్య, నేను జీవించలేం. నా కూతురు కోసం ఆభరణాలు ఉన్నాయి. నా పిల్లలు క్షమించాలి` అని ఉంది. భాగేశ్వర్ ధామ్ భక్తుడైన సంజయ్ సేథ్.. తనకు మరో జన్మంటూ ఉంటే.. మళ్లీ భాగేశ్వర్ ధామ్ భక్తుడిగానే ఉంటానని పేర్కొన్నాడు.
పన్నా నగరంలోని కిశోర్‌గంజ్ (Kishoreganj ) ప్రాంతంలో భార్య మీనూతో కలిసి సంజయ్ సేథ్ జీవిస్తున్నారు. ఘటన జరిగినప్పుడు రెండో అంతస్తులోని వారి రూమ్‌లో పడి ఉన్నారు. బుల్లెట్ శబ్ధం వినిపించడంతో ఇతర కుటుంబ సభ్యులు రెండో అంతస్తుకు పరుగులు తీశారు. అప్పటికే ఆయన భార్య మీనూ మరణించింది. కోన ఊపిరితో ఉన్న సంజయ్ సేథ్‌ను దవాఖానకు తరలిస్తుండగా మరణించాడు.
Odisha Health Minister: ASI జరిపిన కాల్పుల్లో ఒడిశా మంత్రి నాబా కిషోర్ దాస్ మృతి
కుటుంబ వివాదాల వల్లే భార్యాభర్తలు ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక సాక్ష్యాధారాలను బట్టి పన్నా జిల్లా ఎస్పీ ధరమ్‌రాజ్ మీనా తెలిపారు. ఇది చాలా విషాద ఘటన, మా దర్యాప్తు సాగుతున్నది. ఈ ఘటనలో బయటి వ్యక్తులకు సంబంధం ఉన్నట్లు కనిపించడం లేదు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తాం అని అన్నారు.