Shocker: అయ్యో ఆ పనికోసమని బాత్రూం వెళితే, యువకుడి పురుషాంగాన్ని కొరికేసిన పాము, షాక్ లో కుర్రాడు లబోదిబో..
Representational image of snakes | (Photo Credits: PTI)

ఒక పాము బాత్రూంలోకి దూరి ఒక వ్యక్తి పురుషాంగాన్ని కొరికేసిన ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. స్థానిక మీడియా కథనం ప్రకారం.. బ్రిస్బేన్​ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల ఉదయాన్నే బాత్‌రూమ్‌కు వెళ్లాడు. టాయిలెట్ సీట్ మీద కూర్చున్న వెంటనే పురుషాంగాన్ని ఏదో కరిచిన ఫీలింగ్ అనిపించింది. వెంటనే కిందకు చూస్తే పాము కనిపించింది. దాదాపు 1 మీటర్ పొడవున్న పాము టాయిలెట్‌లో ఉండడంతో అతడు షాక్ తిన్నాడు. వెంటనే అక్కడి నుంచి బయటకు పరుగుపెట్టి ఆసుపత్రికి చేరుకున్నాడు. పురుషాంగంపై చిన్న గాయమే కావడంతో పాటు, అది విషపు పాము కాకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు.

ఈ ఘటనపై బాధితుడు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ కొండచిలువ ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై ఆరా తీశారు. ఈ క్రమంలో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. బాధితుడు పొరుగింట్లో 24 ఏళ్లు యువకుడు నివసిస్తున్నాడు. అతడు పాములు, కొండ చిలువలను పెంచుతున్నాడు. ఆ యువకుడి వద్ద 11 పాములు ఉన్నట్లు గుర్తించారు. ఐతే ఆ పాములు అంత విషపూరితమైనది కాదు. అతడి నిర్లక్ష్యం వల్లే ఓ పాము పక్క ఇంట్లో ఉన్న వ్యక్తి టాయిలెట్‌లోకి డ్రేనేజీ ద్వారా వెళ్లిందని గుర్తించారు. పాముల పెంపకంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు అతడిపై కేసు నమోదు చేశారు.