మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) మనోహర్‌సింగ్ గిల్(86) ఆదివారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. 1958 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన గిల్ 1996 డిసెంబర్ నుంచి 2001 జూన్ వరకు 11వ సీఈసీగా సేవలందించారు.2008లో కేంద్ర క్రీడల శాఖ మంత్రి వ్యవహరించారు. ప్రకాశ్ సింగ్ బాదల్ పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ రాష్ట్రంలో ప్రభుత్వ అధికారిగా పనిచేశారు. గిల్‌కు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.ఎంఎస్ గిల్ మృతిపట్ల కేంద్ర ఎన్నికల సంఘం విచారం వ్యక్తం చేసింది. ఆయన 1998లో 12వ లోక్‌సభకు, 1999లో 13వ లోక్‌సభకు ఎన్నికలు విజయవంతంగా నిర్వహించారని కొనియాడింది.
Here's News
Manohar Singh Gill, who served as India’s chief election commissioner from 1996 to 2001, passed away on Sunday, October 15 at Max Hospital in South Delhi’s Saket. He was 87.https://t.co/IM0EGI4Nqo
— The Wire (@thewire_in) October 15, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)