Monkeypox (Pic Credit: Twitter)

కరోనా కల్లోలం నుంచి కోలుకున్న ప్రజలకు మళ్లీ మరో వైరస్ ముచ్చెమటలు పట్టిస్తోంది. ఈ వ్యాధి గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే 23 దేశాలకు పాకిన ఈ వైరస్ కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. తాజాగా ప్రజారోగ్యానికి మంకీపాక్స్‌ (Monkeypox) ముప్పు పొంచి ఉన్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించింది. ప్రపంచ వ్యాప్తంగా వైరస్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయని, ఇప్పటివరకు 23 దేశాల్లో 257 కేసులు నమోదయ్యాయని తెలిపింది. మరో 120 మందిలో లక్షణాలను గుర్తించామని వెల్లడించింది. కొన్ని దేశాల్లో బయటపడిన మంకీపాక్స్‌ వేగంగా వ్యాప్తిచెందుతున్నదని ఆందోళన వ్యక్తంచేసింది. కరోనా కన్నా వేగంగా విస్తరిస్తున్న మంకీ పాక్స్‌, ఐరోపా దేశాల నుంచి మధ్య ప్రాచ్య దేశాలకు పాకిన వైరస్, ఆందోళన వ్యక్తం చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

వైరస్ సమూహ వ్యాప్తి ప్రారంభమైతే.. చిన్నారులు, రోగ నిరోధక శక్తి లేనివారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి ముప్పు పొంచిఉన్నదని డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. త్వరలోనే భారీసంఖ్యలో కేసులు నమోదయ్యే అవకాశం ఉన్నదని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని, వ్యాక్సిన్లను సమకూర్చుకోవాలని సూచించింది. మంకీపాక్స్‌పై అందరికి అవగాహన కల్పించాలని, వ్యాధి లక్షణాలను తెలియజేయాలని పేర్కొన్నది.