నైరుతీ రుతుపవనాలు(Southwest Monsoon) మే 31వ తేదీ వరకు కేరళ తీరాన్ని తాకే అవకాశాలు ఉన్నట్లు ఐఎండీ పేర్కొన్నది. నాలుగు రోజులు ముందుగానీ, లేక ఆలస్యంగా కానీ నైరుతీ రుతుపవనాలు కేరళలోకి ఎంటర్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. ఈ నేపథ్యంలో జూన్ నెలలో వర్షాలు విస్తారంగా కురిసే ఛాన్సు ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. నేడు నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం.. 24 గంటల్లో వాయుగుండంగా అల్పపీడనం.. 5 రోజుల పాటు ఏపీ, తెలంగాణలో వర్షాలు..
మరో వైపు పశ్చిమ రాష్ట్రాలకు హీట్‌వేవ్ వార్నింగ్ ఇచ్చింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, పంజాబ్, యూపీ రాష్ట్రాల్లో తీవ్రమైన ఎండలు ఉన్నట్లు పేర్కొన్నది. కొన్ని రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ రాష్ట్రాల్లో తీవ్రమైన వడగాలులు ఉన్నాయి. ప్రస్తుతం కేరళలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పాతానమిట్ట, ఇడుక్కీ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. మరో 8 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. ప్రస్తుతం కేరళ తీరం వెంట ఫిషింగ్ బ్యాన్ చేశారు.
Here's News
Southwest Monsoon is likely to set in over Kerala on 31st May with a model error of ±4 days: IMD
— ANI (@ANI) May 22, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)