representational image (Photo Credits: Max Pixel)

శృంగారం అనేది ఓ గొప్ప అనుభూతి. భార్యాభర్తల మ‌ధ్య హ‌ద్దుల‌ను చెరిపేసి.. మ‌న‌సుల‌ను ఒకటి చేస్తుంది. ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ‌ను మ‌రింత రెట్టింపు చేస్తుంది. మ‌రి శృంగార కోరిక‌లు.. ఏ రాశి వారిలో ఎలా ఉంటాయో.. ఎలాంటి కోరిక‌ల‌ను క‌లిగి ఉంటార‌నే విషయాల‌ను తెలుసుకుందాం..

వృశ్చిక రాశి(Scorpio): అన్ని రాశుల్లో కెల్లా ఈ రాశిని శృంగార సూచిక‌గా కూడా పిలుస్తారు. ఈ రాశి వారు అత్య‌ధికంగా శృంగార కోరిక‌ల‌ను క‌లిగి ఉంటారు. భార్యాభ‌ర్త‌లిద్ద‌రూ ప‌డ‌క గ‌దిలో ఉన్న‌ప్పుడు శృంగారాన్ని త‌నివితీరా అనుభ‌విస్తారు. బెడ్ రూమ్‌లోనే అధిక స‌మ‌యం ఉండేందుకు ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డుతారు.

మేష రాశి(Aries): ప‌డ‌క గ‌దిలో అధిక సమ‌యం గ‌డిపేందుకు ఇష్ట‌ప‌డుతూనే.. తీవ్ర‌మైన‌, ఉద్వేగ‌భ‌రిత‌మైన కోరిక‌ల‌ను క‌లిగి ఉంటారు. ఈ రాశి వారు శృంగారాన్ని ఒక స‌హ‌జ అంశంగా ప‌రిగ‌ణిస్తారు. అయితే ఈ రాశివారు స‌హ‌జంగానే ఆవేశాన్ని క‌లిగి ఉంటారు కాబ‌ట్టి.. ఇంట‌ర్ కోర్స్‌ను కూడా ఆ విధంగానే జ‌రిపేస్తారు.

క‌ర్కాట‌క రాశి(Cancer): ఈ రాశి వారికి శృంగారం అనేది ఒక భావోద్వేగ కోరిక‌. పార్ట్‌న‌ర్‌తో ఎక్కువ‌గా క‌ల‌లు కంటూ.. రొమాన్స్ చేసేందుకు ఇష్ట‌ప‌డుతుంటారు. నిజంగా త‌మ‌ను ప్రేమిస్తున్నారు అనుకున్న‌ప్పుడే అవ‌తలి వ్య‌క్తితో శృంగారానికి ఇష్ట‌ప‌డుతారు. అయితే ఒక్క‌సారి అనుబంధం ఏర్ప‌డిందంటే.. ఉత్త‌మ భావ‌ప్రాప్తిని అందించే సామ‌ర్థ్యం వీరిలో ఉంటుంది.

చంద్రగ్రహణం..ఈ నాలుగు రాశులు వారికి ఈ ఏడాది తిరుగే ఉండదు, వ్యాపార,ఉద్యోగ, ఆదాయ మార్గాల్లో అంతా బంగారమే, బ్లడ్ మూన్‌పై ప్రత్యేక కథనం

వృష‌భ రాశి(Taurus): ఈ రాశుల వారు శృంగారం అన‌గానే వాలిపోతుంటారు. శృంగారమే జీవితంగా బ‌తికేస్తారు. ఇంద్రియాల‌ను ప్రేరేపించే లైంగిక క‌ల‌యిక‌ల‌ను అధికంగా ఇష్ట‌ప‌డుతారు. పార్ట్‌న‌ర్ యొక్క అవ‌స‌రాల‌ను తీర్చ‌డంలో ఈ రాశుల వారు దిట్ట‌.

మీన రాశి(Pisces): మీన రాశి వారు రొమాంటిక్స్‌కు అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తారు. శృంగారంలో కొత్త విష‌యాల‌ను తెలుసుకునేందుకు ఉత్సాహం చూపుతారు. ప్రేమ‌ను పంచుతూ.. క‌ల‌ల్లో విహ‌రిస్తూ ఉండేందుకు ప్రాధాన్య‌మిస్తారు. త‌న పార్ట్‌న‌ర్‌తో త్వ‌ర‌గా క‌లిసి పోతారు.

క‌న్య రాశి(Virgo): ఈ రాశి వారు బ‌హిరంగంగానే త‌మ శృంగార కోరిక‌ల‌ను వెలిబుచ్చుతారు. శృంగారం స‌మ‌యంలో అస‌భ్య ప‌ద‌జాలం మాట్లాడేందుకు ఇష్ట‌ప‌డుతారు. వీరిని ప‌డ‌క గ‌ది రాజులు అని కూడా పిలుస్తారు.

సింహ రాశి(Leo): సింహ రాశి వారు త‌మ భాగ‌స్వామికి మాన‌సికంగా, శారీర‌కంగా అద్భుత‌మైన అనుభూతిని క‌లిగిస్తారు. ఈ రాశి వారు శృంగార జీవితాన్ని ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డుతారు. అయితే త‌రుచూ ఈ రాశి వారు ఇత‌రుల ప‌ట్ల ఆక‌ర్షితులవుతారు. ఇక ప‌డ‌క గ‌దిలో భాగ‌స్వామికి అధిక ఆనందాన్ని ఇస్తారు.

ధ‌నుస్సు రాశి(Sagittarius): ఈ రాశి వారు శృంగారం పాల్గొన‌డానికి ఆస‌క్తి చూపుతారు. ఇక ప‌డ‌క గ‌దిలో శృంగారంపైనే దృష్టి కేంద్రీక‌రిస్తారు. పార్ట్‌న‌ర్‌కు మంచి అనుభూతిని అందిస్తారు. ధ‌నుస్సు రాశి వారి కోరిక‌లు కూడా విచిత్రంగా ఉంటాయి.

మిధున రాశి(Gemini): ఇక ఈ రాశి వారు కూడా అస‌హ్య‌క‌ర‌మైన ప‌ద‌జాలాన్ని ఉప‌యోగించేందుకు ఇష్ట‌ప‌డుతారు. ప‌డ‌క గ‌దిలో స్త్రీ కీల‌క పాత్ర వ‌హిస్తుంది. కొత్త కొత్త‌గా ప్ర‌య‌త్నిస్తుంటారు. ఈ రాశి వారితో శృంగారంలో పాల్గొనాల‌నుకుంటే ఓపెన్ మైండ్‌తో వెళ్లాలి.

మ‌క‌ర రాశి(Capricorn): ఈ రాశి వారు త‌మ శృంగార జీవితాన్ని ఎవ‌రితోనూ చ‌ర్చించేందుకు ఇష్ట‌ప‌డ‌రు. అన్ని ర‌కాలుగా సుఖం పొందేందుకు ఇష్ట‌ప‌డుతారు.

తులా రాశి(Libra) : తులా రాశి వారు త‌మ జీవిత భాగ‌స్వామి కోరుకున్న తృప్తి కంటే అధిక ఆనందాన్ని ఇస్తారు. అందుకోసం ఆ విధంగా ప్ర‌య‌త్నిస్తారు కూడా. భాగ‌స్వామికి భావ‌ప్రాప్తిని ముందుగానే అందించి.. ఉత్తేజితుల‌ను చేస్తారు.

కుంభ రాశి(Aquarius): ఈ రాశి వారు త‌మ శృంగార కోరిక‌ల‌ను బ‌య‌ట‌కు చెప్ప‌రు. శృంగారానికి కూడా అధిక ప్రాధాన్య‌త ఇవ్వ‌రు. కానీ ఒక‌సారి జీవిత భాగ‌స్వామి మ‌న‌సుకు ద‌గ్గరైతే.. అసాధార‌ణ ప‌ద్ధతిలో, ఓపెన్ మైండ్‌తో ఉండిపోతారు.