Mumbai-Police Representational Picture. Credits: ANI

Mumbai, Feb 28: నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) ముంబై పోలీసులను అప్రమత్తం (Mumbai Police on Alert ) చేసింది. వారితో పాకిస్తాన్, చైనా, హాంకాంగ్‌లలో శిక్షణ పొందిన "ప్రమాదకరమైన వ్యక్తి" (Dangerous Man) గురించి సమాచారాన్ని పంచుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ డేంజరస్ మ్యాన్ పట్ల పోలీసులు సహా మహారాష్ట్రలోని అన్ని దర్యాప్తు సంస్థలు అప్రమత్తంగా ఉండాలని అధికారులకు మెయిల్స్ పంపింది.

జాంబిలుగా మార్చుతున్న జైలజీన్‌ డ్రగ్ సైడ్ ఎఫెక్ట్స్ ఇవిగో, చర్మంలో అవయువాలు కుళ్లిపోయి, నడిచే శవాల్లా మారుతున్న బాధితులు

ఇండోర్‌కు చెందిన ఓ ప్రమాదకర వ్యక్తి మంబైలోని ప్రవేశించాడని, అతడు చైనా, పాకిస్థాన్, హాంకాంగ్‌లో (Trained in China, Pakistan) శిక్షణ తీసుకుని వచ్చాడని ఈ మెయిల్ లో హెచ్చరించింది.ఈ డేంజర్ మ్యాన్ పేరు సర్ఫరాజ్‌ మిమాన్‌. ఇతనికి సంబంధించిన ఆధార్‌ కార్డు, పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్ కాపీలను ఎన్‌ఐఏ అన్ని దర్యాప్తు సంస్థలకు పంపింది. కొద్ది రోజుల క్రితం ఓ గుర్తు తెలియని వ్యక్తి సర్ఫరాజ్ మిమాన్‌ గురించి ఎన్‌ఐఏకు మెయిల్ చేసి అప్రమత్తం చేశాడు. దీంతో సర్ఫరాజ్‌ను అరెస్టు చేసేందుకు పోలీసు ప్రత్యేక బృందాలు రంగంలోకి అతని కోసం గాలిస్తున్నాయి.

మళ్లీ ఆందోళన, చిన్నారులను చంపేస్తోన్న అడెనోవైరస్, పశ్చిమ బెంగాల్‌లో ఒక్క రోజులోనే ముగ్గురు చిన్నారులు మృతి, 500 నమూనాలలో 33 శాతం మందికి పాజిటివ్

రెండు రోజుల క్రితమే ఫిబ్రవరి 25న ఢిల్లీ పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. వీరు ఆయుధాల శిక్షణ తీసుకునేందుకు పాకిస్తాన్‌కు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా గుర్తించి చాకచక్యంగా అరెస్టు చేశారు. ఇద్దరిలో ఒకరు థానే వెస్ట్‌కు చెందిన ముబారక్ ఖాన్‌ కాగా.. మరొకరు తమళనాడుకు చెందిన అబ్దుల్లా అని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. అతడిని అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.