Imphal, March 20: మణిపూర్ ముఖ్యమంత్రిగా ఎన్ బీరెన్ సింగ్ (N Biren Singh ) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం ఇంఫాల్‌లో(Imphal) జరిగిన మణిపూర్ బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బిరెన్ సింగ్ ను కేంద్రమంత్రులు నిర్మలాసీతారామన్ (Nirmala Sitaraman), కిరెన్ రిజిజు అభినందించారు. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ అందరూ ఇది ఏకగ్రీవంగా తీసుకున్న మంచి నిర్ణయం అన్నారు. మణిపూర్‌లో స్థిరమైన, బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఉండడానికి నిదర్శనమని తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వంలో కేంద్రం ఈశాన్య రాష్ట్రాలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని చెప్పారు.
#WATCH | BJP central observers Nirmala Sitharaman, Kiren Rijiju and other BJP MLAs felicitate the unanimously elected Chief Minister of Manipur N Biren Singh in Imphal. pic.twitter.com/2vfgco20SZ
— ANI (@ANI) March 20, 2022
గతంలో కూడా మణిపూర్ సీఎంగా బీరెన్ సింగ్ పని చేశారు. ఈ నెల 10వ తేదీన మణిపూర్ ఎన్నికల రిజల్డ్ రాగా, అక్కడ బీజేపీకి మెజార్టీ స్థానాలు దక్కాయి. దీంతో మరోసారి అధికారం చేజిక్కించుకుంది. కొత్త సీఎం అభ్యర్ధిపై బీజేపీ నానా విధాలుగా యత్నించింది. కానీ చివరకు పాత సీఎంనే కొనసాగించాలని నిర్ణయిచింది. అయితే కేబినెట్ లో మాత్రం మార్పులు జరుగనున్నాయి.