మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నుపుర్ శ‌ర్మ‌కు దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఉప‌శ‌మనం ల‌భించింది. దేశ వ్యాప్తంగా ఆమెపై న‌మోదైన 10 కేసుల‌ను ఢిల్లీ కోర్టుకు బ‌దిలీ చేయాల‌ని సుప్రీంకోర్టు బుధ‌వారం ఆదేశాలు జారీ చేసింది. ఆ కేసుల‌న్నింటినీ ఢిల్లీ పోలీసులే విచారిస్తార‌ని తెలిపింది. ఇక‌పై నుపుర్ శ‌ర్మ‌పై ఎక్క‌డా ఎఫ్ఐఆర్ న‌మోదైన ఆ కేసుల‌న్నీ ఢిల్లీ కోర్టుకే బ‌దిలీ అవుతాయ‌ని, ఢిల్లీ పోలీసులే ప‌ర్య‌వేక్షిస్తార‌ని కోర్టు స్ప‌ష్టం చేసింది. నుపుర్ శ‌ర్మ మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌లు చేసి వార్త‌ల్లో నిలిచిన సంగ‌తి విదితమే.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)