పేటీఎంకు చెందిన పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ (ppbl)కు కేంద్ర ఆర్థిక శాఖ నుంచి భారీ షాక్‌ తగిలింది. కేంద్ర ఆర్ధిక శాఖ ఫైనాన్షియల్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌-ఇండియా(FIU-IND) పీపీబీఎల్‌కు భారీ జరిమానా విధించింది. మనీలాండరింగ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్-ఇండియా రూ.5.49 కోట్ల జరిమానా విధించింది .అక్రమ నగదు లావాదేవీల నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) నిబంధనల ఉల్లంఘింపు కారణమే ఈ జరిమానా అని తెలిపింది.

కేంద్ర ఆర్ధిక శాఖ మార్చి 1న విడుదల చేసిన ఒక ప్రకటనలో.. తన ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ విభాగానికి ఆన్‌లైన్‌లో లావాదేవీలు, లావాదేవీలను సులభతరం చేయడంతో సహా కొన్ని సంస్థలు చట్ట విరుద్దంగా వ్యాపార కార్యకాలాపాలు చేస్తున్నాయంటూ పలు ప్రభుత్వ ఏజెన్సీల నుండి సమాచారం వచ్చింది. దీంతో పేటీఎం పేమెంట్‌ బ్యాంక్‌ లావాదేవీలపై దృష్టిసారించామని తెలిపింది.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)