ఈ రోజు పార్టీలకు అతీతంగా కొంతమంది ఎంపీలతో కలిసి ప్రధాని మోదీ (PM Modi) పార్లమెంట్ క్యాంటీన్ (Parliament Canteen)లో భోజనం చేసి అందర్నీ ఆశ్చర్యపర్చారు.బీజేపీతో సహా పలు పార్టీలకు చెందిన ఎనిమిది మంది ఎంపీలను ప్రధాని నేడు లంచ్‌కు ఆహ్వానించారు. దీనిగురించి మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఎంపీలకు ప్రధాని నుంచి ఫోన్ వచ్చింది. ‘పదండి.. ఈ రోజు మీకో పనిష్మెంట్ ఇస్తాను’ అని మోదీ వారితో సరదాగా అన్నట్లు సమాచారం.
అనంతరం ఎంపీలతో కలిసి ప్రధాని పార్లమెంట్ క్యాంటీన్‌కు వెళ్లారు.దాదాపు 45 నిమిషాల పాటు కొనసాగిన ఈ లంచ్‌లో ప్రధాని మోదీ పలు విషయాలపై ముచ్చటించినట్లు తెలుస్తోంది. తనతో పాటు ఆ ఎంపీల భోజనానికి అయిన ఖర్చును ప్రధానే చెల్లించినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. లంచ్ చేసిన వారిలో బీజేపీ ఎంపీలు హీనా గవిట్, కోన్యక్, జమ్‌యంగ్ నంగ్యాల్, ఎల్ మురుగన్, టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు, బీఎస్పీ ఎంపీ రితేష్ పాండే, బీజేడీ ఎంపీ సస్మిత్ పాత్ర ఉన్నారు.
Here's Video and Pics
#Watch | PM @narendramodi had lunch with fellow MPs at Parliament Canteen today.
He was joined by MPs across party line & from different parts of the country. pic.twitter.com/7ep5SWTH5B
— DD News (@DDNewslive) February 9, 2024
Delhi | Prime Minister Narendra Modi had lunch with MPs at Parliament Canteen today. pic.twitter.com/98F0IAa3dt
— ANI (@ANI) February 9, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)