Maharashtra Crisis: ఏక్ నాథ్ షిండేకు షాక్, రెండుగా చీలిన సేన రెబెల్ క్యాంపు, ఫలించిన ఉద్ధవ్ ప్లాన్, మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించే దిశగా అడుగులు...
Eknath Shinde (Credits: Facebook)

మహారాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా శివసేన ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుటా ఎగరేసిన నేపథ్యంలో శివసేన కీలక నేత ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని రెబల్ ఎమ్మెల్యేలు అసోంలోని గౌహతి చేరుకున్నారు. ప్రస్తుతం షిండే వర్గంలో లుకలుకలు మొదలయ్యాయి. రెబల్ ఎమ్మెల్యేలు అంతా ఏకతాటిపై లేరని.. విలీనంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. కొంతమంది ఎమ్మెల్యేలు బీజేపీలో విలీనం కావాలంటుండగా.. మరికొందరు విలీనంకు వ్యతిరేకంగా ఉన్నారు.

ఇదిలా ఉండగా.. మహారాష్ట్ర గవర్నర్ కరోనా నుండి కోలుకుని రాజ్ భవన్‌కు రావడంతో మహా రాజకీయాలు అన్ని రాజ్ భవన్‌కు చేరుకున్నాయి. రెబల్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేందుకు శివసేన వేగంగా పావులు కదుపుతోంది. రెబల్ ఎమ్మెల్యేలకు భద్రతా కల్పించాలని గవర్నర్ పోలీసులను ఆదేశించారు. రెబల్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా శివసేన కార్యకర్తలు తీవ్ర ఆందోళనలు చేస్తున్నారు. ఊహించని ఈ రాజకీయ సంక్షోభ పరిణామంతో మహారాష్ట్ర అట్టుడికిపోతోంది. ఇదిలా ఉండగానే మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధిస్తారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.