అత్యాచార బాధితురాలిని లైంగికంగా వేధించిన వ్యక్తి బిడ్డకు జన్మనివ్వమని బలవంతం చేయకూడదని అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. లైంగిక దాడికి గురైన బాధితురాలు గర్భవతి అయినపుడు, బిడ్డకు జన్మనివ్వాలని ఆమెను నిర్బంధించడం సరికాదని, అలా చేస్తే, వర్ణనాతీతమైన దుఃఖానికి దారి తీస్తుందని అలహాబాద్ హైకోర్టు (Allahabad High Court) చెప్పింది. పన్నెండేళ్ల వయసుగల మూగ, చెవిటి దివ్యాంగురాలు దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ తీర్పునిచ్చింది.అత్యాచార బాధితురాలు, మైనర్, తన 25 వారాల గర్భాన్ని తొలగించడానికి ఆదేశాలు జారీ చేయాలని ప్రార్థిస్తూ ఆమె తల్లి ద్వారా కోర్టును ఆశ్రయించింది.

బాధితురాలి పొరుగింట్లో ఉన్న వ్యక్తి ఆమెపై అనేకసార్లు అత్యాచారం చేసినట్లు తెలిపారు. ఆమెకు మాటలు రానందువల్ల ఆమె ఆ దారుణాల గురించి ఎవరికీ చెప్పలేకపోయినట్లు తెలిపారు. ఆమె తల్లి గట్టిగా ప్రశ్నించినపుడు, తన పొరుగింటి వ్యక్తి తనపై లైంగిక దాడి చేసినట్లు సంకేత భాష ద్వారా చెప్పినట్లు తెలిపారు.ఈ నేపథ్యంలో 25 వారాల గర్భాన్ని తొలగించేందుకు అనుమతించాలని పిటిషనర్ కోరారు.

Allahabad High Court (Photo Credit- PTI)

Here's Bar Bench Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)