Representational Image (Photo Credits: Pexels)

ప్రశ్న : హాయ్ నా పేరు బుజేష్ (పేరు మార్చాం), నా వయస్సు 50 సంవత్సరాలు. నేను కొన్ని కారణాలతో నా ఇంతవరకూ పెళ్ళి చేసుకోలేదు. అంతే కాదు, ఎవ్వరితోనూ శారీరక సంబంధం కూడా పెట్టుకోలేదు. మరి ఇప్పుడు నాకు సెక్స్ మీద ఆసక్తి కలుగుతోంది. ఇప్పుడు నేను శృంగారం చేయొచ్చా.నాకు ఎవరినైనా చూసి వారితో రొమాన్స్ చేయాలనుకున్నప్పుడు ఇవే భయాలతో నా మనసుని కంట్రోల్ చేసుకోలేకపోతున్నా.. దయచేసి నాకు సలహా ఇవ్వండి.

శృంగారంలో ఫోర్ ప్లే అంటే ఏమిటి? ఫోన్ సెక్స్ నుండి ఓరల్ సెక్స్ వరకు, తీవ్రమైన ఉద్వేగం కోసం మానసిక స్థితిని పొందే మార్గాలు

సమాధానం: మీ సమస్య అర్థమైంది బుజేష్. మీరు శృంగారం చేయడం విషయంలో లేనిపోని అపోహలు పెట్టుకుంటున్నారు. సెక్స్ కి వయసుతో సంబంధం లేదు. మీ వయస్సు 50 సంవత్సరాలే కాదు, 60 దాటినా కూడా ఆ కార్యాన్ని మీరు ఎంజాయ్ చేయొచ్చు. అయితే మీరు మీ శరీరాన్ని 20 ఏళ్ళ వారిగా మార్చలేరు.శృంగార సమయంలో టీనేజ్‌లో ఉన్నవారి బాడీలా మీరు స్పందించకపోవచ్చు. కానీ, శృంగారం ఇచ్చే తృప్తి అందరికీ ఒకేలా ఉంటుంది. ఇది మీ హృదయాన్ని ఫాంటసీతో నింపుతుంది.ఈ వయసులో మీరు కూడా మీకు ఇష్టమైన పనిని చేయడంలో తప్పులేదు.మీరు ఒక్కరు మాత్రమే కాదు ఇలాంటి వారు చాలా మందే ఉన్నారు. చాలా మంది ఏవేవో కారణాలతో వయసు పెరిగినా ఇంకా ఆ కార్యపు అనుభూతిని రుచిచూడలేదు. కాబట్టి అనవసర ఆలోచనలు వద్దు.

నా భర్త బూతులు మాట్లాడుతూ శృంగారం చేస్తున్నాడు, నాకు అవి చాలా అసహ్యం అనిపిస్తున్నాయి, ఆయనకు ఎలా చెప్పాలో తెలియడం లేదు..

40 సంవత్సరాలు వచ్చినా వర్జిన్‌గా ఉండడం చాలా సాధారణ విషయం. మీరు ఇప్పటికీ ఎవ్వరినీ వివాహం చేసుకోపోయినా, శృంగారం చేయకపోయినా ఆందోళన పడాల్సిన పని లేదు. ఇది మీకు ఇష్టమైనప్పుడే చేయాలి. మరెవరి లైఫ్‌తో సంబంధం లేదు. మీరు పూర్తి నమ్మకంగా, మానసికంగా సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే శృంగారం చేయాలి. కాబట్టి తోటి వారితో పోల్చుకుని ఇబ్బంది పడొద్దు.