SBI on Rs 2000 Note Deposit: ఎస్‌బీఐకి వారం రోజుల్లో రూ.17 వేల కోట్ల విలువైన రూ.2 వేల నోట్లు, డిపాజిట్లు ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలిపిన ప్రభుత్వ బ్యాంక్

రూ.2 వేల నోటును చలామణిలో నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఈ నెల 19న ప్రకటించిన విషయం తెలిసిందే. 24వ తేదీ నుంచి నోట్ల మార్పిడికి అవకాశం కల్పించింది. దీంతో జనం తమ దగ్గర ఉన్న పెద్ద నోట్లను పలు బ్యాంకుల్లో మార్చుకుంటున్నారు

SBI on Rs 2000 Note Deposit: ఎస్‌బీఐకి వారం రోజుల్లో రూ.17 వేల కోట్ల విలువైన రూ.2 వేల నోట్లు, డిపాజిట్లు ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలిపిన ప్రభుత్వ బ్యాంక్
Representative Image

రూ.2 వేల నోటును చలామణిలో నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఈ నెల 19న ప్రకటించిన విషయం తెలిసిందే. 24వ తేదీ నుంచి నోట్ల మార్పిడికి అవకాశం కల్పించింది. దీంతో జనం తమ దగ్గర ఉన్న పెద్ద నోట్లను పలు బ్యాంకుల్లో మార్చుకుంటున్నారు.వీరిలో ఎక్కువ శాతం మంది బ్యాంకు ఖాతాదారులు రూ.2 వేల నోట్లను డిపాజిట్ చేయడానికే మొగ్గు చూపుతున్నారని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఆర్బీఐ నిర్ణయంతో ఈ వారం రోజుల్లో రూ.17 వేల కోట్ల విలువైన పెద్ద నోట్లు ఎస్బీఐకి వచ్చాయని పేర్కొంది.

జీతాల్లో కోత తప్పదని ఉద్యోగులకు టీసీఎస్ హెచ్చరిక, నెలకు 12 రోజులు ఆఫీసు నుంచి పని చేయని వారికి మెమోలు

ఇందులో సుమారు రూ.14 వేల కోట్ల విలువైన నోట్లను ఖాతాదారులు డిపాజిట్ చేయగా.. మిగతా రూ.3 వేల కోట్ల విలువైన నోట్లను మార్చుకున్నారని వివరించింది. నోట్ల మార్పిడి, డిపాజిట్ కు సెప్టెంబర్ 30 వరకు అవకాశం ఉండడంతో బ్యాంకుల్లో డిపాజిట్లు పెరుగుతాయని బ్యాంకు రీసెర్చ్ వింగ్ అంచనా వేసింది. దాదాపు 80 శాతం ఖాతాదారులు రూ.2 వేల నోట్లను డిపాజిట్ చేస్తుండడంతో షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంక్ ల పరంగా బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ లక్ష కోట్లకంటే గణనీయంగా పెరుగుతుందని ఎస్బీఐ రీసెర్చ్ వింగ్ పేర్కొంది.

(The above story first appeared on LatestLY on May 31, 2023 04:14 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).