Femina Miss India 2022 కిరీటాన్ని కర్ణాటక రాష్ట్రానికి చెందిన Sini Shetty గెలుచుకుంది. ముంబై నగరంలో జరిగిన vlcc ఫెమీనా మిస్ ఇండియా గ్రాండ్ ఫినాలేలో కర్ణాటకకు చెందిన సినిశెట్టిని ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2022 టైటిల్ విజేతగా ప్రకటించారు. జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన ఈ వేడుకలో రాజస్థాన్ కు చెందిన Rubal Shekhawat మిస్ ఇండియా 2022 ఫస్ట్ రన్నర్ అప్ గా, ఉత్తరప్రదేశ్ కు చెందిన షినతా చౌహాన్ ఫెమీనా మిస్ ఇండియా 2022 సెకండ్ రన్నరప్ గా నిలిచారు. విస్తృతమైన స్కౌటింగ్ డ్రైవ్ ఇంటర్వ్యూ రౌండ్ల తర్వాత ఆయా రాష్టాలనుంచి 31 మంది ఫైనలిస్టులను ఎంపిక చేశారు. 58వ ఫెమీనా నా మిస్ ఇండియాగా టైటిల్ కైవసం చేసుకున్న సినీ శెట్టి స్వరాష్ట్రం కర్ణాటక అయినా ముంబైలోనే పుట్టి పెరిగింది. అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ లో బ్యాచులర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ప్రస్తుతం చార్టెడ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ గా చేస్తున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)