సుప్రీంకోర్టులో ధ‌ర్మాస‌నం ఇక‌పై చేప‌ట్టే విచార‌ణ‌లన్నింటినీ మ‌నం ప్ర‌త్య‌క్షంగా చూడ‌వ‌చ్చు. సుప్రీంకోర్టు అధికారిక యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఈ ప్ర‌త్యేక ఏర్పాట్లు ఈ నెల 27 నుంచి అందుబాటులోకి రానున్నాయి. తెలుగు నేల‌కు చెందిన భార‌త మాజీ ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ త‌న ప‌ద‌వీ విర‌మ‌ణ రోజున చేప‌ట్టిన విచార‌ణ‌ల‌ను సుప్రీంకోర్టు లైవ్‌లో పెట్టిన సంగ‌తి తెలిసిందే. అదే మాదిరిగా ఇక‌పై ఈ నెల 27 నుంచి సుప్రీంకోర్టులోని రాజ్యాంగ ధ‌ర్మాస‌నం చేప‌ట్టే ప్ర‌తి విచార‌ణ‌ను దేశ ప్రజ‌లంతా ప్ర‌త్య‌క్షంగానే వీక్షించ‌వ‌చ్చు. ఎప్పుడో 2018లో కోర్టు విచార‌ణ‌ల ప్రత్య‌క్ష ప్ర‌సారాల‌కు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇన్నాళ్ల‌కు అమ‌లు అవుతోంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)