జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యగ్రహణం ఒక ముఖ్యమైన సంఘటనగా చెప్పవచ్చు. ఈ సంవత్సరం చివరి సూర్యగ్రహణం అక్టోబర్ రెండున వస్తుంది. ఈ సూర్యగ్రహణం కారణంగా మొత్తం 12 రాశులు కూడా ప్రభావాలను చూపుతుంది. ముఖ్యంగా ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ మూడు రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈసారి సూర్యగ్రహణం భారత కనిపించదు అయితే ఇది పశ్చిమ దేశంలో కనిపిస్తుంది. భారత కాలమాన ప్రకారం అక్టోబర్ 2వ తేదీ 913 నిమిషాలకు ప్రారంభమై అక్టోబర్ 3 తెల్లవారుజామున 3 గంటల 17 నిమిషాల వరకు కొనసాగుతుంది.
మీన రాశి- ఈ సంవత్సరం చివరి సూర్యగ్రహణం వల్ల మీన రాశి వారికి చాలా సానుకూల ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా వీరి జీవితం చాలా ఆనందమయంగా ఉంటుంది. సూర్య భగవానుడి ఆశీస్సులతో వీరు అనేక పనుల్లో విజయాన్ని సాధిస్తారు. వీరికి ఆకస్మికంగా డబ్బు లభిస్తుంది. ఇంట్లో శుభకార్యాలు చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎప్పటినుంచో పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు. విదేశాల్లో చదివే అవకాశాలు లభిస్తుంది. కోర్టులో పెండింగ్లో ఉన్న పనులు కూడా పరిష్కారం అవుతాయి.
కుంభరాశి- ఈ రాశి వారికి సూర్యభగవానుని అనుగ్రహం వల్ల ఈ సూర్యగ్రహణం నుండి వీరి జీవితంలో అనేక మార్పులు జరుగుతాయి. ఈ రాశి వారికి సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. కొత్త వ్యాయామం వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఇది అనుకూలంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో గొడవలు తగ్గిపోయి మీ బంధం బలపడుతుంది. మీరు మీ పిల్లల నుండి వారి చదువుల నుండి అనేక శుభవార్తలు వింటారు. ఎప్పటినుంచో కొనాలనుకున్న కొత్త ఇంటి కల నెరవేరుతుంది. మీ వ్యాపారాన్ని విస్తరించడానికి విదేశాలలో పెట్టుబడులు పెడతారు. అది మీకు లాభదాయకంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళతారు.
Astrology: సెప్టెంబర్ 30న శుక్రుడు కన్య రాశి నుండి తులా రాశిలోకి ప్రవేశం .
తులారాశి- ఈ రాశి వారికి ఈ చివరి సూర్యగ్రహణం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఎప్పటినుంచో దీర్ఘకాలికంగా ఇబ్బంది పడుతున్న అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు. దీనివల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. తీర్థయాత్రలకు వెళతారు. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తారు. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. పాత పెట్టుబడిలో నుండి డబ్బును పొందుతారు. పూర్వీకుల నుండి రావాల్సిన ఆస్తులు వస్తాయి. విద్యార్థులు కోరుకున్న రంగాలలో వారి కెరీర్ను ప్రారంభిస్తారు. ఉద్యోగం చేసే వారికి వారి పనుల్లో ప్రమోషన్ లభిస్తుంది. వీరి పని పట్ల వీరు బాసు ఎల్లప్పుడు ఆనందంగా ఉంటారు.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.