ఎంపీ, ఎమ్మెల్యేల లంచాల కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించిన సంగతి విదితమే. ఎంపీ, ఎమ్మెల్యేలు ఎవరైనా లంచాలు తీసుకుంటే విచారణ ఎదురుకోవాల్సిందేనని రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. పార్లమెంటు, అసెంబ్లీలలో లంచాలు తీసుకుంటే ఎవరైనా సరే తప్పకుండా విచారణ ఎదుర్కోవాల్సిందేనని ధర్మసనం ఏకగ్రీవ తీర్పును వెల్లడించింది. చట్ట సభల్లో సభ్యులు లంచం తీసుకుని ప్రశ్నలు వేసినా ఇది వర్తిస్తుందని తెలిపింది. ఈ తీర్పుపై ప్రధాని మోదీ స్పందించారు. ఎక్స్ లో ఆయన ట్వీట్ చేస్తూ.. స్వాగతం! స్వచ్ఛమైన రాజకీయాలను నిర్ధారిస్తూ, వ్యవస్థపై ప్రజలకు విశ్వాసాన్ని పెంపొందింపజేసే గొప్ప తీర్పు సుప్రీం కోర్టు ఇచ్చిందని తెలిపారు. ఎంపీ, ఎమ్మెల్యేలకు లంచం కేసుల్లో సుప్రీంకోర్టు సంచలన తీర్పు, వారికి రాజ్యాంగ రక్షణ మినహాయింపు లేదని స్పష్టం చేసిన ధర్మాసనం
Here's PM Modi Tweet
SWAGATAM!
A great judgment by the Hon’ble Supreme Court which will ensure clean politics and deepen people’s faith in the system.https://t.co/GqfP3PMxqz
— Narendra Modi (@narendramodi) March 4, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)