ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, సీనియర్‌ న్యాయవాది కల్పతి వెంకటరమణ్‌ విశ్వనాథన్‌ సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. ఇద్దరు న్యాయమూర్తులతో సీజేఐ డీవై చంద్రచూడ్‌ శుక్రవారం ప్రయాణ స్వీకారం చేయించారు. ఇటీవల జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరి, జస్టిస్‌ ఎంఆర్‌ షా పదవీ విరమణ చేయడంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 34 నుంచి 32కు పడిపోయిన విషయం తెలిసిందే.

ఇప్పుడు వీరిద్దరి నియామకంతో సర్వోన్నత న్యాయస్థానం న్యాయమూర్తుల సంఖ్య మళ్లీ పూర్తి స్థాయికి చేరింది. ప్రస్తుతం సుప్రీంలో సీజేఐతో సహా 34 మంది జడ్జీలు ఉన్నారు. అయితే వీరిలో మరో ముగ్గురు న్యాయమూర్తులు.. జస్టిస్ కెఎమ్ జోసెఫ్, జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ వి రామసుబ్రమణియన్ వేసవి సెలవుల్లో పదవీ విరమణ చేయనున్నారు. దీంతో మళ్లీ సంఖ్య తగ్గిపోనుంది.

News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)