ఉత్తరాఖండ్‌లో నిర్మాణంలో ఉన్న సొరంగం పాక్షికంగా కూలిపోయిన ఘటనలో చిక్కుకున్న కూలీలంతా క్షేమంగానే ఉన్నారు. మంగళవారం సాయంత్రం ఒక్కొక్కరిని బయటకు సురక్షితంగా తీసుకొస్తున్నారు. గంటలోపు దాదాపు ఆపరేషన్‌ విజయవంతంగా పూర్తి అవుతుందని రెస్క్యూటీం ప్రకటించింది. 17 రోజుల మారథాన్ ఆపరేషన్ తర్వాత, 41 మంది కార్మికులలో మొదటి కార్మికుడిని సిల్క్యారా సొరంగం నుండి తరలించారు.

చిక్కుకున్న మిగిలిన కార్మికులను బయటకు తీసుకురావడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యలు చివరి దశకు చేరుకోవడంతో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి మాట్లాడుతూ శిథిలాల మధ్య చిక్కుకున్న 41 మంది కార్మికులను బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు సిల్క్యారా సొరంగం లోపలికి పైపులు నెట్టడం జరిగిందని చెప్పారు. అంతకు ముందు దాదాపు 17 రోజులుగా సొరంగంలో ఉన్న వీరి వద్దకు ఆరు అంగుళాల వ్యాసం ఉన్న గొట్టాన్ని పంపించారు. ఆ పైప్‌ ద్వారా ఓ ఎండోస్కోపీ తరహా కెమెరాను పంపగా.. కూలీలంతా సురక్షితంగా ఉన్నట్లు అందులో కన్పించింది. ఈ దృశ్యాలను రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్ ధామి ఎక్స్‌లో పంచుకున్నారు.

First Worker Successfully Evacuated From Silkyara Tunnel; Rescue Operation Underway

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)