YS Jagan New Decession: ఏపీ సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం, మంత్రులను మారుస్తూ ఉత్తర్వులు, కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్ షాతో భేటీ కోసం ఢిల్లీ వెళ్లిన జగన్

ఏపీ సీఎం వైయస్ జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాలకు కొత్త మంత్రులను ఇన్ ఛార్జ్ లుగా నియమించారు. ఇప్పటివరకు ఉన్న వారిని వేరేచోటుకు మారుస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. 13 జిల్లాలకు ఇన్‌చార్జ్ మంత్రులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం జీవో జారీ చేశారు.

రాజకీయాలు Hazarath Reddy|

Andhar Pradesh Govt Changed Incharge Ministers For Districts

Amaravathi,October 21: ఏపీ సీఎం వైయస్ జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాలకు కొత్త మంత్రులను ఇన్ ఛార్జ్ లుగా నియమించారు. ఇప్పటివరకు ఉన్న వారిని వేరేచోటుకు మారుస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. 13 జిల్లాలకు ఇన్‌చార్జ్ మంత్రులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం జీవో జారీ చేశారు. జిల్లాల ఇన్‌చార్జ్ మంత్రులు ఆయా జిల్లాల్లో ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ పథకాలు అమలు, అభివృద్ధి కార్యకలాపాల పురోగతిని సమీక్షించడంతోపాటు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటారని జీవోలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వెల్లడించారు. వాస్తవానికి జులై నెలలోనే ఇన్‌చార్జ్ మంత్రులను నియమించిన జగన్ సర్కారు ఇప్పుడు 12 జిల్లాలకు ఇన్‌చార్జ్ మంత్రులను మార్చింది.

చిత్తూరు జిల్లాకు మాత్రం మేకపాటి గౌతమ్ రెడ్డినే కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖల మంత్రిగా మేకపాటి పని చేస్తున్నారు.

ఇక ఇన్‌చార్జ్ మంత్రుల జాబితాలో హోంమంత్రి మేకతోటి సుచరితకు ఇంతకుముందు నెల్లూరు జిల్లా బాధ్యతలు అప్పగించారు. ఈసారి జాబితాలో ఆమె పేరు లేదు. ఆమె బదులు బాలినేని శ్రీనివాస రెడ్డికి నెల్లూరు జిల్లా బాధ్యతలను అప్పగించారు.

శ్రీకాకుళం జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని)ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ ఇన్‌చార్జి మంత్రిగా వ్యవహరించారు. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం నుంచి ఎన్నికైన కొడాలి నాని పౌరసరఫరాలశాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. కాగా వెలంపల్లి శ్రీనివాస్‌ను విజయనగరం జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా నియ మించారు.

కర్నూలు జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రిగా పి.అనిల్‌కుమార్‌ నియమితులయ్యారు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా గెలిచిన ఈయన ప్రస్తుతం రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్థానంలో జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రిగా నియమితులయ్యారు.

బొత్సను ప్రస్తుతం అనంతపురం జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రిగా నియమితులయ్యారు.

పశ్చిమగోదావరి జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రిగా రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) నియమితులయ్యారు. ఇప్పటి వరకూ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రిగా వ్యవహరించారు.

ఇప్పటి వరకూ తూర్పుగోదావరి జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన ఆళ్ల నాని స్థానంలో మంత్రి మోపిదేవి వెంకటరమణను నియమించారు.

సీఎం జగన్ అక్టోబర్ 22వ తేదీన ఢిల్లీలో ఉంటారని సీఎం కార్యాలయం అధికారులు వెల్లడించారు. 21వ తేదీన ఉ.10.05 గంటలకు విజయవాడ గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి సీఎం మధ్యాహ్నం 12.05గంటలకు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంటారు. ఢిల్లీలో రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలు, సమస్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో జగన్ భేటి అవుతారు. కేంద్ర మంత్రులతో మాట్లాడి రాత్రికి ఢిల్లీలోనే జగన్ బసచేస్తారు. 22వ తేదీ మ.3.30 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరి విశాఖపట్నం చేరుకుని తర్వాత అరకు ఎంపీ గొడ్డేటి మాధవి వివాహ రిసెప్షన్‌కు హాజరవుతారని సీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.

జిల్లాల వారీగా ఇంచార్జి మంత్రులు వీరే

శ్రీకాకుళం :కొడాలి వెంకటేశ్వరరావు(నాని)

విజయనగరం :వెల్లంపల్లి శ్రీనివాస రావు

విశాఖపట్నం :కురసాల కన్నబాబు

తూర్పుగోదావరి :మోపిదేవి వెంకటరమణ

పశ్చిమ గోదావరి:పేర్ని వెంకటరామయ్య(నాని)

కృష్ణా :పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

గుంటూరు :చెరుకువాడ శ్రీ రంగనాథ రాజు

ప్రకాశం :బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి

నెల్లూరు :బాలినేని శ్రీనివాస రెడ్డి

కర్నూలు :అనిల్ కుమార్ యాదవ్

కడప :ఆదిమూలపు సురేశ్

అనంతపురం :బొత్స సత్యనారాయణ

చిత్తూరు :మేకపాటి గౌతమ్ రెడ్డి

సిటీ పెట్రోల్ డీజిల్
View all
Currency Price Change

సంపాదకుల ఎంపిక

ఫ్లింటాఫ్ కొడుకు రాకీ ఫ్లింటాఫ్, తండ్రికి మాదిరిగానే బ్యాటింగ్ చేస్తున్న వీడియో వైరల్" class="rhs_story_title_alink">

Rocky Flintoff Pull Shots Video: పుల్ షాట్స్‌తో మూడు సిక్సర్లు బాదిన ఆండ్రూ ఫ్లింటాఫ్ కొడుకు రాకీ ఫ్లింటాఫ్, తండ్రికి మాదిరిగానే బ్యాటింగ్ చేస్తున్న వీడియో వైరల్

  • 2024 భారతదేశం ఎన్నికలు: నాగాలాండ్ లో జీరో పోలింగ్ శాతం న‌మోదు, ఓటింగ్ బ‌హిష్క‌రించిన‌ 4 ల‌క్ష‌ల మంది ఓట‌ర్లు, క‌నీసం ఓటు వేసేందుకు ముందుకు రాని 20 మంది ఎమ్మెల్యేలు

  • Jasprit Bumrah Yorker Video: జస్ప్రీత్ బుమ్రా యార్కర్ వీడియో ఇదిగో, దెబ్బకు ఫ్యూజులు ఎగిరి అలానే చూస్తుండిపోయిన రిలే రూసో

  • Raghu Rama Krishna Raju Files Nomination: టీడీపీ, జ‌న‌సేన కూట‌మికి షాక్ ఇచ్చిన ర‌ఘురామ కృష్ణంరాజు, బీ ఫాం ఇవ్వ‌క‌పోయినప్ప‌టికీ ఉండి నియోజ‌క‌వ‌ర్గం నుంచి నామినేష‌న్ దాఖలు, రెబ‌ల్ గా పోటీ చేస్తారా?

  • SSMB 29 Latest Update: మహేశ్‌బాబు-రాజమౌళి మూవీ SSMB29 లేటెస్ట్ వీడియో ఇదిగో, పొడవాటి జుట్టు, గడ్డంతో అదరగొడుతున్న సూపర్ స్టార్ న్యూలుక్

  • సిటీ పెట్రోల్ డీజిల్
    View all
    Currency Price Change