జార్ఖండ్ రాజకీయ సంక్షోభానికి తెరపడింది. చంపయ్ సొరెన్ నేతృత్వంలోని సర్కారు బల పరీక్షలో నెగ్గింది. చంపయ్ ప్రభుత్వానికి అనుకూలంగా 47 ఓట్లు రాగా వ్యతిరేకంగా 29 ఓట్లు వచ్చాయి. హేమంత్ సొరెన్ అరెస్టు అనంతరం జార్ఖండ్‌లో నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చంపయ్ సొరెన్ ప్రభుత్వానికి నేడు అసెంబ్లీలో విశ్వాస పరీక్ష జరిగింది.
జార్ఖండ్‌లో 81 అసెంబ్లీ స్థానాలకు ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రస్తుతం అసెంబ్లీలో జార్ఖండ్ ముక్తి మోర్చా(28), కాంగ్రెస్(16), ఆర్జేడీ(1) కూటమికి 45 సీట్లు ఉన్నాయి. సీపీఐ(ఎంఎల్) ఏకైక ఎమ్మెల్యే ఆ కూటమికి బయటి నుంచి మద్దతిస్తుండగా.. బీజేపీతో కూడిన విపక్ష కూటమికి 29 మంది ఎమ్మెల్యేలున్నారు. బలపరీక్షలో గెలవాలంటే జేఎంఎం కూటమికి 41 అవసరం కాగా 47 ఓట్లతో బల పరీక్షలో విజయం సాధించింది
Here's ANI Tweet
CM Champai Soren led Jharkhand government wins floor test after 47 MLAs support him
29 MLAs in opposition. #JharkhandPolitics pic.twitter.com/30BBXMjaak
— ANI (@ANI) February 5, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)