ఓనం పండుగ దక్షిణ భారతదేశంలోని కేరళ రాష్ట్రంలో ప్రధాన పండుగ. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మళయాలీలు ఓనం పండుగను ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఈసారి ఓనం పండుగను సెప్టెంబర్ 08న జరుపుకుంటున్నారు. హిందూ క్యాలెండర్ ప్రకారం, ఓనం పండుగను భాద్రపద మాసంలో జరుపుకుంటారు. మలయాళ సౌర క్యాలెండర్ ప్రకారం, ఓనం పండుగ చింగం మాసంలో శిరువోణం నక్షత్రంలో వస్తుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం, దీనిని శ్రావణ నక్షత్రం అంటారు.
ఓనం 2022 తిథి, శుభ ముహూర్తం
మలయాళ క్యాలెండర్ ప్రకారం, తిరువోణం నక్షత్రం సెప్టెంబర్ 7, 2022న సాయంత్రం 4 గంటల నుండి సెప్టెంబర్ 8వ తేదీ మధ్యాహ్నం 01:46 గంటల వరకు ప్రారంభమవుతుంది. శ్రావణ నక్షత్రాన్ని మలయాళంలో తిరు ఓణం అంటారు. మలయాళ క్యాలెండర్ ప్రకారం చింగం మాసంలో, తిరు ఓణం ప్రబలంగా ఉన్నప్పుడు హిందూ క్యాలెండర్‌లో శ్రవణ నక్షత్రం అని పిలువబడే తిరువోణం నక్షత్రాన్ని పూజిస్తారు.
ఓనం పండుగ ప్రాముఖ్యత
కేరళలో, తిరువోణం నక్షత్రంలో సంవత్సరానికి ఒకసారి బలి చక్రవర్తి పాతాళం నుండి తన ప్రజలను కలుసుకోవడానికి భూమికి తిరిగి వచ్చిన సందర్భంగా ఓనం పండుగ జరుపుకుంటారు. పౌరాణిక విశ్వాసాల ప్రకారం, మూడు లోకాలను బలి చక్రవర్తి పరిపాలించాడు. మహాబలికి తన ప్రజల పట్ల ప్రత్యేక అనుబంధం ఉండేది. ఆయన పాలనలో ప్రజలు ఎంతో సంతోషించారు. బలి చక్రివర్తి తన బలం, శక్తితో, యుద్ధంలో దేవతలందరినీ ఓడించాడు.
దేవతలతో సహా మూడు లోకాలపై నియంత్రణ సాధించాడు. అప్పుడు విష్ణువు వామన అవతారం తీసుకుని మూడు లోకాలను మూడడుగులుగా కొలిచాడు. మహా దాత అయిన బలి చక్రర్తి నుంచి మూడడుగుల భూమిని వాగ్దానంగా పొందాడు. మహావిష్ణువు బలి చక్రవర్తి సంతోషించి అతన్ని పాతాళానికి అధిపతిగా చేశాడు. ఓనం రోజున బలి చక్రవర్తి తన ప్రజలను కలవడానికి భూమికి వస్తాడని అన్ని ప్రాంతాల్లో ప్రయాణిస్తాడని నమ్ముతారు. ప్రజలు తమ రాజుకు స్వాగతం పలికేందుకు తమ ఇళ్లను అలంకరించుకుంటారు.