Beer can help you combat obesity and get a good night's sleep (Photo-GETTY)

Mumbai,December 1: మీకు పొట్ట ఎక్కువగా ఉందా, బొజ్జతో బయట తిరగలేకున్నారా..అయితే ఇకపై మీరు రోజుకొక బీర్ తాగండి. మీకు రాత్రి పూట నిద్ర రావడం లేదా.. సుఖవంతమైన నిద్ర కోసం ముఖం వాచిపోయి ఉన్నారా..అయితే రోజుకో బీరు తాగండి.. మీరు రోజూ ఓ బీరు తాగడం వల్ల పొట్ట కరిగిపోవడమే( Beer can help you combat obesity) కాకుండా సుఖవంతమైన నిద్ర(getting a better night's sleep)పడుతుందట. ఈ విషయాన్ని ఆమ్‌స్టర్‌డామ్‌ యూనివర్శిటీ(Amsterdam University)లో బ్యాక్టీరియా నిపుణుడిగా పనిచేస్తున్న ప్రొఫెసర్‌ ఎరిక్‌ క్లాసెన్‌ (Professor Eric Claassen) చెబుతున్నారు. మరి దీనికి కారణం కూడా ఆయనే చెబుతున్నారు.

బీరులో ఉన్న మంచి గుణాలున్నాయట. వీటిలో ఒకరకమైన బ్యాక్టీరియా(probiotic microbes – bacteria), ఈస్ట్‌ మిశ్రమం (probiotic yeast) ఉండడమే అందుకు కారణమని శాస్త్రవేత్తలు తేల్చారు. అయితే అన్ని బీర్లలో ఈ గుణం ఉందో, లేదో తెలియదుగానీ బెల్జియంకు చెందిన హోగార్డెన్, వెస్ట్‌మల్లే ట్రిపల్, ఎట్‌ క్రైకెన్‌బియర్‌ బ్రాండ్‌ల బీర్లలో ఈ మంచి గుణాలు ఉన్నాయట. ఆ బీర్లు రెండుసార్లు, భూగర్భంలో ఉండగా ఒకసారి, సీసాలో మరోసారి బీరు పులియడం వల్ల వాటికి ఆ మంచి గుణాలు వస్తాయట.

భూగర్భంలో పులియడానికి ఒకరకమైన ఈస్ట్, సీసాలో పులియడానికి మరో రకమైన ఈస్ట్‌ను ఉత్పత్తిదారులు ఉపయోగిస్తున్నారని, ఈ రెండోసారి పులియడంతోనే బీరులో ఎక్కువగా ఆరోగ్య లక్షణాలు చేరుతున్నాయని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. వాటిలో కూడా లైట్‌ బీరుకన్నా స్ట్రాంగ్‌ బీరే మంచిదని, అలా అని ఎక్కువగా బీర్లు తాగమని వారు సిఫార్సు చేస్తున్నారు. ‘ఎక్కువ ఆల్కహాల్‌ ఆరోగ్యానికి మంచిది కాదు, ఈ రకమైన బ్రాండ్లలో రోజొకటి తాగినా ఆరోగ్యానికి మంచిదే. ఈ రకాల బీరు బాటిళ్లలో 50 శాతానికిపైగా మంచి బ్యాక్టీరియా ఉంది’ ఆయన చెబుతున్నారు. సో అదన్న మాట విషయం