Ashadha Month:  నేటి నుంచి ఆషాఢ మాసం ప్రారంభం, ఈ నెల అత్తవారింట్లో కొత్తకోడలు ఉంటే జరిగే అనర్థం ఇదే, కొత్త దంపతులు ఈ నెల కలిసి కాపురం చేయొచ్చా..
Pic Source: Wikipedia

తెలుగు పంచాంగం ప్రకారం ఆషాడ మాసం పవిత్రమైనది కాదు. ఈ నెలలో శుభకార్యాలకు జరగవు. ఆషాడంలో ఎట్టిపరిస్థితుల్లో వివాహాలు జరిపించరు. ఆషాడ మాసంలో కొత్త కోడలు అత్తగారింట్లో ఉండకూడదు. ఆషాడ మాసం దేవతలను పూజించడానికి చాలా పవిత్రమైనది. ఆషాడ మాసంలో పవిత్రమైన పూజలు, వ్రతాలు, రథ యాత్రలు, పల్లకి సేవలకు శుభప్రదం. అందుకే ఈ నెలలో ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి. ఆషాడంలో అలాగే పండితులు పూజా కార్యక్రమాల్లో నిగమ్నమై బిజీగా ఉంటారు.

శివసేన రెబల్ ఎమ్మెల్ షిండే ఫోటోపై కోడిగుడ్లు విసిరిన కార్యకర్తలు, పోస్టర్‌పై ఇంక్‌ చల్లి నిరసన

ఆషాడంలో శ్రీమహావిష్ణువు నిద్రలోకి వెళ్తాడు, దీనివల్ల వివాహం చేసుకున్న దంపతులకు ఆయన ఆశీస్సులు లభించవు, అలాగే ఆషాడమాసం వచ్చిందంటే కొత్తగా వచ్చిన కోడలు అత్తగారింట్లో ఉండకూడదు. అందుకే వారిని తమ పుట్టింటికి పంపిస్తారు. ఆషాడ మాసంలో గర్భం దాల్చితే తల్లీ, బిడ్డలకు అనారోగ్య సమస్యలు వస్తాయని మన పూర్వీకులు భావించేవారు. అందుకే భార్యాభర్తలను ఈ నెలలో దూరంగా పెట్టే సంప్రదాయం తీసుకొచ్చారు. వేసవిలో సాధారణంగా ప్రసవం వల్ల ఇబ్బందులు ఉంటాయి.. అందుకే భార్యాభర్తలను వేరుగా ఉంచేవారు.

ఆషాడమాసంలో చేతులకు గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిదని చెబుతారు. అయితే ఆషాడం మాసంలో వాతావరణ మార్పులు చోటుచేసుకుంటాయి. దీని వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా గోరింటాకు పెట్టుకునే సంప్రదాయం పాటించేవాళ్లట. ఆధ్యాత్మికంగా చూస్తే ఆషాడంలో చిటికెన వేలికి పెట్టుకున్న గోరింటాకు కార్తీకం నాటికి గోరు చిగురుకు చేరుతుంది.. గోరింటాకు పెట్టుకున్న చిటికెన వేలి చిగురు నుంచి నీళ్లు శివలింగంపై పడితే పుణ్యఫలమని అంటారు.