astrology

జ్యోతిక శాస్త్రం ప్రకారం గురు గ్రహానికి శని గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. డిసెంబర్ 31వ తేదీ రాత్రి 10: 45 నిమిషాలకు ఈ రెండు గ్రహాలు పూర్వాభాద్రపద నక్షత్రంలోనికి ప్రవేశిస్తాయి. ఈ గ్రహాలు కదలిక వల్ల మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ మూడు రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

వృషభ రాశి- శని గురు గ్రహాల కలయిక వల్ల అనేక సానుకూల ఫలితాలు ఉంటాయి. మీరు డబ్బు సంబంధం అనేక ప్రయోజనాలు పొందుతారు. పెండింగ్లో ఉన్న పనులను సకాలంలో పూర్తిచేస్తారు. దీని ద్వారా డబ్బు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీకు ఉద్యోగం చేసే చోట ప్రమోషన్ లభిస్తుంది. దీని ద్వారా జీతం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం మారాలనుకునే వారికి ఇది మంచి అనుకూలమైన సమయం. కుటుంబ సభ్యుల మధ్య సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. అస్థికి సంబంధించిన వివరాలు పరిష్కారం అవుతాయి. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. కొత్త పెట్టుబడులతో మీ వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. మీరు పని చేసే కార్యాలయంలో మంచి అవకాశాలు లభిస్తాయి. పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. సహోదరులతోటి ఆనందంగా ఉంటారు.

Vastu Tips: వాస్తు ప్రకారం బెడ్రూంలో మంచం ఏ దిశలో ఉండాలి, 

కన్య రాశి- కన్య రాశి వారికి శని గ్రహం గురు గ్రహం కలయిక వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. చట్టపరమైన వివాదాల నుంచి బయటపడతారు. ఆ నిర్ణయాలు మీకు అనుకూలంగా వస్తాయి. కోర్టు సంబంధ విషయాలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. పాత వ్యాధుల నుండి ఉపశమనాన్ని పొందుతారు. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలకు వెళతారు. వివాదాలు తొలగిపోతాయి. ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు ఉంటాయి. మీ కష్టానికి తగిన ఫలితాలు వస్తాయి. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తే కల నెరవేరుతుంది.

కుంభరాశి- కుంభరాశి వారికి ఈ సమయం చాలా ఫలితాలను ఇస్తుంది పెట్టుబడి పెట్టడానికి ఇది అనుకూలం .ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. గతం కంటే ఇప్పుడు ఆర్థిక బలపడతారు. మీరు చేసే ప్రతి ప్రణాళికలు విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామితో కలిసి టూర్లకు వెళతారు. వ్యాపారంలో మంచి మంచి ప్రాజెక్ట్లను పొందుతారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభిస్తుంది. విద్యార్థులకు ఇది మంచి సమయం విద్యార్థులు పోటు పరీక్షలు ఉత్తీర్ణులు అవుతారు. ఇది తల్లిదండ్రులకు ఆనందాన్ని కలిగిస్తుంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.