Astrology: కొత్త సంవత్సరం లో మొదటి పండుగ మకర సంక్రాంతి ఈ ఏడాది ఈ పండుగను జనవరి 14వ తేదీన జరుపుకుంటున్నారు. సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించడం ద్వారా మకర సంక్రాంతి పండుగ వస్తుంది. అయితే మకర సంక్రాంతి రోజు అనే శుభ ఫలితాలు ఉన్నాయి. ఇది అనేక శుభకార్యాలకు అనువైనదిగా చెప్పబడుతుంది. అయితే మకర సంక్రాంతి రోజున కొన్ని పనులు చేయడం ద్వారా ఈ సంవత్సరం అంతా కూడా శుభ ఫలితాలు కలుగుతాయి. అయితే ఆ పనులు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
స్నానం.. మకర సంక్రాంతి రోజు నదిలో పువ్వులతో స్నానం చేయడం చాలా పవిత్రంగా భావిస్తారు. అయితే ఇది అన్నివేళలా సాధ్యం కాకపోవచ్చు. కానుక మీరు నదిలో పువ్వులతో స్నానం చేయడం కుదరనప్పుడు ఇంట్లోనే స్నానం చేసే నీటిలో పువ్వులను కాస్త నువ్వులను వేసుకొని చేయడం మంచిది. దీనికోసం ఎర్రటి పువ్వులను నువ్వులను వేసుకొని సూర్యదేవుడికి నమస్కరించి స్నానం చేయాలి.
Vastu Tips: వాస్తు ప్రకారం బెడ్రూంలో మంచం ఏ దిశలో ఉండాలి,
పండ్లు దానం చేయడం- మకర సంక్రాంతి రోజున ఉదయాన్నే స్నానం తర్వాత పూజ చేసుకున్న తర్వాత ఏవైనా పండ్లను ఎవరికన్నా దానం చేయడం ద్వారా విశేషమైన పుణ్యం లభిస్తుంది. ఈ రోజున ఇలా పండ్లను దానం చేయడం ద్వారా మీకు ఆర్థిక సమస్యలు తొలగిపోయి అదృష్టం లభిస్తుంది.
పాయసం- మకర సంక్రాంతి రోజు సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన పాయసాన్ని నువ్వులను సమర్పించాలి. ఇది నైవేద్యంగా సూర్యభగవానునికి సమర్పించడం ద్వారా ఆ సూర్యభగవానుడి అనుగ్రహంతో ఈ సంవత్సరం అంతా మీరు ఆర్థిక నష్టాలు లేకుండా ఆరోగ్యంగా కూడా ఉంటారు.
విరాళాలు- మకర సంక్రాంతి రోజున పేదవారికి ఆహారం బట్టలు డబ్బులు దానం చేయడం చాలా మంచిది. ఇలా చేయడం వల్ల మీ ఉన్న కష్టాలు తొలగిపోయి ఏలినాటి శని కూడా తొలగిపోయి అన్ని మంచి ఫలితాలు లభిస్తాయి. కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. మకర సంక్రాంతి రోజున ఈ పనులు తప్పకుండా చేయండి వీటి ద్వారా మీకు ఆర్థిక సమస్యలు తొలగిపోయి అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోయి అన్ని మంచి ఫలితాలు లభిస్తాయి.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.