astrology

Astrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం త్రిగ్రహీయోగం ఫిబ్రవరి 27వ తేదీన ఏర్పడుతుంది. బుధుడు, సూర్యుడు, శని గ్రహాలు కలిసి త్రిగ్రహి యోగాన్ని ఏర్పరచబోతున్నాయి. దీనికి కారణంగా 12 రాశుల వారికి అనుకూలంగా ఉంది. అయితే ముఖ్యంగా ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ అదృష్ట రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

మేష రాశి- మేష రాశి వారికి విగ్రహ యోగం అనేక శుభ ఫలితాలను తీసుకొని వస్తుంది. వీరికి అదృష్టం కలిసి వస్తుంది. వ్యాపారంలో అనేక లాభాలు ఉంటాయి. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఎప్పటినుంచో కొనాలనుకుంటున్న సొంత ఇంటి కల నెరవేరుతుంది. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. వ్యాపారంలో లాభాలు ఉంటాయి.

Vastu Tips: బెడ్రూంలో పొరపాటును కూడా ఈ వస్తువులను ఉంచకండి,

మీన రాశి- మీన రాశి వారికి త్రిగ్రహ యోగం అనేక శుభ ఫలితాలను అందిస్తుంది. వీరిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కెరీర్ పరంగా మంచి లాభాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఆర్థిక లాభాలు పెరుగుతాయి. విదేశాల్లో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి మంచి లాభాలు వస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు.

కర్కాటక రాశి- కర్కాటక రాశి వారికి త్రిగ్రహ యోగం అనేక శుభ ఫలితాలను అందిస్తుంది. వీరు ఏ పని చేపట్టిన విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యులతో కలిసి గడుపుతారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి.ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కోరుకున్నచోట ఉద్యోగం బదిలీ అవుతుంది. విదేశాల్లో పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.