జ్యోతిషా శాస్త్రం ప్రకారం బుధ గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. కొత్త సంవత్సరంలో బుధుడు తన కదలికలను మార్చుకుంటాడు. జనవరి 6 తేదీన బుధుడు వృశ్చిక రాశి నుండి ధనస్సు రాశిలోకి మధ్యాహ్నం 12 :1 0 నిమిషాలకు ప్రవేశిస్తాడు. ప్రకారం ఈ కదలిక అనేక మార్పులను తీసుకువస్తున్నాయి. ముఖ్యంగా l మూడు రాశులు వారికి అదృష్టాన్ని తీసుకొస్తుంది. ఆ మూడు రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
వృషభ రాశి- పొదిలి కలయిక వల్ల ఈ రాశి వారికి సంపద పెరుగుతుంది. వీరికి అదృష్టం వరిస్తుంది. అద్భుతమైన సానుకూల ప్రభావాలు ఉంటాయి. ఉద్యోగం చేసే వారికి పదోన్నతులు వస్తాయి. జీతం పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. వ్యాపారం చేసేవారికి భాగస్వామ్య పెట్టుబడుల ద్వారా మంచి లాభాలు వస్తాయి. స్టాక్ మార్కెట్లో ఉన్నవారికి ఆకస్మిక ధన లాభం ఉంటుంది. విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే కళ నెరవేరుతుంది. విదేశాల్లో చదువుకునే అవకాశాలు వస్తాయి. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు.
Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం గ్యాస్ స్టవ్ ఏ దిక్కున ఉంటే మంచిది ...
కన్యారాశి- కన్య రాశి వారికి బుధ గ్రహ సంచారం కారణంగా ధన వ్యాపారంలో రెండు కూడా లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార విస్తరణ కోసం మీరు చేసే ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. కొత్త ఆదాయం అణువులు వస్తాయి. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు లభిస్తాయి. సృజనాత్మక రంగాల్లో పనిచేసే వారికి విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విద్యార్థులు చదువులో ముందంజలో ఉంటారు.
సింహరాశి- సింహరాశి వారికి కెరీర్లో పురోగతి ఉంటుంది. ఆదాయం రెట్టింపు అవుతుంది. పెండింగ్లో ఉన్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్లు లభిస్తాయి.కొత్త అవకాశాలు వస్తాయి. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. విదేశాల్లో పెట్టుబడులు పెడతారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు. విదేశాల్లో చదువుకోవాలని కదా నెరవేరుతుంది. కోర్టు సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.