Astrology: చంద్రగ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇది విలాసాలని సంతోషాలను ఐశ్వర్యాన్ని అందించే గ్రహంగా ఉంటుంది. చంద్ర గ్రహం జనవరి 23వ తేదీన రాత్రి 9 గంటల 10 నిమిషాలకు సింహరాశి నుండి కన్యా రాశిలోకి ప్రవేశిస్తుంది. ఈ సంచారం కారణంగా అన్ని శుభ ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా మూడు రాశుల వారికి అద్భుతమైన ధనయోగం లభిస్తుంది. ఆ మూడు రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మేషరాశి.. మేష రాశి వారికి చంద్రుని సంచారం కారణంగా అన్ని శుభ ఫలితాలు పొందుతారు. కోర్టు సమస్యల నుంచి బయటపడతారు. ఆకస్మికంగా ధన లాభం వచ్చే అవకాశాలు ఉన్నాయి. పూర్వీకుల నుంచి రావాల్సిన ఆస్తి లభిస్తుంది. ఏలినాటి శని తొలగిపోతుంది. వ్యాపార పరంగా లాభాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Vastu Tips: వాస్తు ప్రకారం బెడ్రూంలో మంచం ఏ దిశలో ఉండాలి
మిథున రాశి.. మిథున రాశి వారికి చంద్రుని సంచారం సానుకూల ఫలితాలను అందిస్తుంది. ఈ రాశి వారికి జనవరి 23 నుంచి మంచి రోజులు వస్తాయి. వివాహం కాని వారికి వివాహమయ్య అవకాశాలు ఉన్నాయి. ప్రేమ వివాహాలకు అనుకూలం. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. పై చదువులు చదవాలి అనుకున్న విద్యార్థులకల నెరవేరుతుంది. విదేశాల్లో సీటు లభిస్తుంది. వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉంటాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు ఉంటాయి కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళతారు.
కుంభరాశి.. కుంభ రాశి వారికి చంద్రుని సంచారం మంచి ఫలితాలను అందిస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభిస్తుంది. జీతాలు పెరుగుతాయి. ఖర్చులు తగ్గుతాయి. ఆదాయం పెరుగుతుంది. దీనివల్ల ఆనందకర వాతావరణ ఉంటుంది. ఎప్పటినుంచో ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు. ఇది మీకు మానసిక ఆందోళన నుంచి బయట పడేస్తుంది మొండి బకాయిల నుంచి డబ్బు తిరిగి వస్తుంది. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం ఎప్పటినుంచో కొనాలనుకుంటున్న సొంత ఇంటి కల నెరవేరుతుంది.
Disclaimer:పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.