Astrology: జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాల రాజుగా సూర్యుడికి పేరు వ్యాపారంలో ఉద్యోగంలో ప్రతి పనిలోనూ సూర్యుడు అనుగ్రహంతో పురోగతి ఉంటుంది. సూర్యుడు రాశి మార్పు కారణంగా 12 రాశుల పైన శుభ ,అశుభ ఫలితాలు ఉంటాయి. ఫిబ్రవరి 6 తేదీన గురువారం రోజు ఉదయం ఏడు గంటల 50 నిమిషాలకు సూర్యుడు ధనిష్ట నక్షత్రంలోనికి ప్రవేశిస్తాడు. దీని ద్వారా ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ అదృష్ట రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
మేష రాశి- మేష రాశి వారికి సూర్యుడి నక్షత్ర మార్పు కారణంగా అనేక సానుకూల ఫలితాలు ఉంటాయి. ఎప్పటినుంచో పెండింగ్లో ఉన్న పనులు సకాలంలో పూర్తవుతాయి. మతపరమైన కార్యక్రమాలలో ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగాల్లో ప్రమోషన్ లభిస్తుంది. పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. సంపద పెరిగే అవకాశాలు ఉన్నాయి. పని భారం తగ్గుతుంది. మీకు ఏది అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి విదేశీయానం చేసే అవకాశాలు ఉన్నాయి.
Vastu Tips: మీ బెడ్ రూం నుండి ఈ 5 వస్తువులను వెంటనే తొలగించండి ...
కన్యా రాశి- కన్యా రాశి వారికి సూర్యుడు ధనిష్ట నక్షత్రం లోనికి ప్రవేశించడం కారణంగా అదృష్టం కలిసి వస్తుంది. ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తారు. ఇచ్చిన డబ్బు తిరిగివస్తుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. సామాజికంగా గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. కేరియర్లో ముందుకు వెళతారు. వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు.
మేషరాశి- మేషరాశి వారికి సూర్యుని సంచారం చాలా ప్రయోజనాలను కలిగిస్తుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు తొలిగిపోతాయి. ఖర్చులు తగ్గుతాయి. ఆ అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఎప్పటినుంచో కొనాలనుకుంటున్న సొంత ఇంటి కల నెరవేరుతుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత నెలకొంటుంది గొడవలు తగ్గుతాయి. వివాహం కాని వారికి వివాహమయ్య అవకాశాలు ఉన్నాయి. సంపద పెంచుకోవడానికి అనేకమార్గాలు వస్తాయి. విదేశాల్లో పెట్టుబడులు పెడతారు. అవి మంచి లాభాలను తీసుకొని వస్తాయి.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.