astrology

Astrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని గ్రహం,బుధు గ్రహం రెండు కూడా మంచి ఫలితాలను ఇచ్చే గ్రహాలుగా చెప్పవచ్చు, అయితే జనవరి 22వ తేదీన ఈ రెండు గ్రహాల సంయోగం చాలా అదృష్టాలను కొన్ని రాశుల వారికి తీసుకొని వస్తుంది.అయితే ఇది ముఖ్యంగా మూడు రాశుల వారికి అఖండ ధన ప్రాప్తిని  తీసుకొస్తుంది. ఆ మూడు రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

మీన రాశి- మీన రాశి వారికి శని బుధుడు సంయోగం మంచి ఫలితాలను అందిస్తుంది. ఈ రాశి వారికి కోరుకున్నచోట ఉద్యోగం బదిలీ అవుతుంది. మీడియా రంగంలో ఉన్నవారికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి మంచి శుభ ఫలితాలు ఉంటాయి. వ్యాపార పరంగా అనేక లాభాలు ఉంటాయి. వ్యాపార విస్తరణ కోసం విదేశాల్లో పెట్టుబడులు పెడతారు. ఇది మీకు లాభాలను తీసుకొస్తుంది.

కన్యా రాశి- కన్య రాశి వారికి బుధుడు, శని కలయిక అనేక శుభ ఫలితాలను తీసుకొని వస్తుంది. వివాహం కాని వారికి వివాహమయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ వివాహాలకు ఎక్కువ అనుకూలం. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు ఉండవు. ఎప్పటినుంచో ఇబ్బంది పడుతున్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.

Vastu Tips: వాస్తు ప్రకారం బెడ్రూంలో మంచం ఏ దిశలో ఉండాలి,

కుంభరాశి- కుంభ రాశి వారికి శని, బుధుడు కలయిక అదృష్టాన్ని తీసుకొని వస్తుంది. ఈ సంవత్సరం వీరికి అనేక శుభ ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. అప్పులు తీరిపోతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు. కోరుకున్నచోట సీట్ లభిస్తుంది. కోర్టు సమస్యల నుంచి బయటపడతారు. ఇది మీకు మానసిక సమస్యలు తొలగిస్తుంది. ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు ఉండవు. విద్యార్థులు విదేశాల్లో చదువుకోవాలని నెరవేరుతుంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.